Tuesday, March 28, 2023

Breaking: ఈడీ విచారణకు హాజరైన ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి

బీఆర్ఎస్ ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) కార్యాలయానికి చేరుకున్నారు. ఆయన కు ఈడీ నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే. రోహిత్ రెడ్డి ఆర్థిక లావాదేవీలపై ఈడీ ఆరా తీస్తోంది. అయ్యప్ప దీక్షలో ఉన్నందున ఈడీని ఈనెల 31వరకు సమయం కోరానని తెలిపారు. అయితే ఈడీ అధికారులు తన గడువు విజ్నప్తిని తిరస్కరించడంతో ఈరోజు విచారణకు వచ్చానన్నారు. విచారణకు తాను పూర్తిగా సహకరిస్తానని రోహిత్ రెడ్డి తెలిపారు. ఏ కేసులో తనను విచారణకు పిలిచారో తెలియదన్నారు.

- Advertisement -
   

Advertisement

తాజా వార్తలు

Advertisement