Tuesday, April 30, 2024

ఏపీలో ముద్దు…తెలంగాణలో వద్దు

ఏపీలో బీజేపీ తో జత కట్టిన పవన్ కళ్యాణ్ తెలంగాణ బిజెపి పై అసంతృప్తి వ్యక్తం చేశారు. జనసేన బలాన్ని తెలంగాణ బిజెపి నాయకులు చులకనగా చేసి మాట్లాడుతున్నారని పవన్ కళ్యాణ్ అన్నారు. జనసేన ఆవిర్భావ వేడుకలు లో మాట్లాడిన పవన్ కళ్యాణ్ అమిత్ షా కి కూడా తమ పార్టీ బలమేంటో తెలుసని అందుకే తనతో స్నేహం కోరుకుంటున్నారని అన్నారు. కానీ తెలంగాణ బిజెపి నేతలు మాత్రం తమను తేలికగా తీసి వేస్తున్నారని ఆరోపించారు.

తెలంగాణలో ఉన్న జనసేన కార్యకర్తలు, నాయకులు బీజేపీతో పొత్తు వద్దని తన వద్దకు వచ్చి తెలిపారని.. వారి అభిప్రాయం మేరకు ఎమ్మెల్సీ ఎన్నికల్లో తెరాస పార్టీకి చెందిన వాణి దేవి కి మద్దతు తెలిపినట్లు స్పష్టం చేశారు. తెలంగాణ బిజెపి నాయకత్వం పై పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు దుమారాన్ని రేపుతున్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement