Tuesday, May 7, 2024

స్టీల్ ప్లాంట్ పై ఏపీ సర్కార్ ముందకొస్తే కేంద్రం ఆలోచిస్తుంది: కిషన్ రెడ్డి

విశాఖ స్టీల్‌ ప్లాంట్  ప్రైవేటీక‌ర‌ణ‌ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ఉక్కు పరిరక్షణ పోరాట వేదిక  ఆధ్వ‌ర్యంలో నిర‌స‌నలు కొనసాగుతూనే ఉన్నాయి.  ఇప్పటికే అన్ని వర్గాల్లోనూ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తున్నాయి. అయితే ఇవాళ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఈ అంశంపై మాట్లాడారు. విశాఖ స్టీల్‌ప్లాంట్ విషయంలో కేంద్ర ప్ర‌భుత్వం విధానపరమైన నిర్ణయం తీసుకుందని తెలిపారు. నష్టాల్లో కొన‌సాగుతోన్న విశాఖ ఉక్కు ప‌రిశ్ర‌మ‌ను నడపడం భారమని చెప్పుకొచ్చారు. ఒక వేళ‌ స్టీల్‌ప్లాంట్ ను త‌మ ప‌రిధిలోకి తీసుకోవడానికి ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ ప్రభుత్వం ముందుకొస్తే ఆ విష‌యంపై కేంద్ర స‌ర్కారు ఆలోచిస్తుంద‌ని తెలిపారు. ఉక్కు ప‌రిశ్ర‌మ‌ల‌ కోసం ప్రజాస్వామ్యంలో నిరసన తెలిపే హ‌క్కు ప్ర‌తి ఒక్క‌రికీ ఉంద‌ని చెప్పారు.ఈ రోజు ఆయ‌న ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ…  విశాఖ స్టీల్‌ప్లాంట్ విషయంలో కేంద్ర ప్ర‌భుత్వం విధానపరమైన నిర్ణయం తీసుకుందని తెలిపారు. నష్టాల్లో కొన‌సాగుతోన్న విశాఖ ఉక్కు ప‌రిశ్ర‌మ‌ను నడపడం భారమని చెప్పుకొచ్చారు. ఒక వేళ‌ స్టీల్‌ప్లాంట్ ను త‌మ ప‌రిధిలోకి తీసుకోవడానికి ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ ప్రభుత్వం ముందుకొస్తే ఆ విష‌యంపై కేంద్ర స‌ర్కారు ఆలోచిస్తుంద‌ని తెలిపారు. ఉక్కు ప‌రిశ్ర‌మ‌ల‌ కోసం ప్రజాస్వామ్యంలో నిరసన తెలిపే హ‌క్కు ప్ర‌తి ఒక్క‌రికీ ఉంద‌ని చెప్పారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement