Wednesday, May 15, 2024

ప్రధాని మోదీకి ప‌వ‌న్ క‌ళ్యాణ్‌ బర్త్ డే విషెస్…

ప్రధాన మంత్రి నరేంద్రమోదీకి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. దేశానికి వరుసగా రెండుసార్లు ప్రధాన మంత్రిగా, గుజరాత్ రాష్ట్రానికి నాలుగుసార్లు ముఖ్యమంత్రిగా పని చేసిన అజేయ రాజకీయ విజయుడు అని కొనియాడారు. ఒక సాధారణ దిగువ మధ్యతరగతి కుటుంబంలో పుట్టిన ఒక సామాన్యుడు… అసామాన్యమైన భారత దేశపు ప్రధాన మంత్రి గా నిలిచారంటే ఆ రాజకీయ ప్రయాణం ఎంత సంక్లిష్టమైనదో ఊహించవచ్చన్నారు. ముఖ్యమంత్రిగా గుజరాత్ రాష్ట్రాన్ని అగ్రగామిగా నిలిపిన ఆయన దార్శనికత, ప్రధాన మంత్రిగా క్లిష్టమైన, సున్నితమైన అంశాలపై తీసుకున్న నిర్ణయాలు మోదీని రాజకీయవేత్తగా అగ్రపథాన నిలిపాయని జనసేనాని అన్నారు. మోదీకి ఆ భగవంతుడు సంపూర్ణ ఆయురారోగ్యాలు ప్రసాదించాలని ప్రార్ధిస్తున్నట్లు పవన్ కళ్యాణ్ తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement