Wednesday, May 15, 2024

ప‌త్తు త‌ల మూవీ టీజ‌ర్ రిలీజ్.. అద‌ర‌గొట్టిన శింబు

చాలా రోజుల త‌ర్వాత హీరో శింబు అవుట్ అండ్ మాస్ సినిమాలో న‌టిస్తున్నాడు. ఆ చిత్ర‌మే ప‌త్తు త‌ల‌.ఈ మూవీ టీజ‌ర్ ని రిలీజ్ చేశారు. ఎన్‌ క్రిష్ణ దర్వకత్వం వహించిన ఈ సినిమాలో గౌతమ్‌ కార్తిక్‌ కీలకపాత్ర పోషించాడు. స్టూడియో గ్రీన్‌, పెన్‌ స్టూడీయోస్‌ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మించాడు. ఏ. ఆర్‌ రెహమాన్‌ స్వరాలు సమకూర్చాడు. ఇక ఈ సినిమా మార్చి 30న గ్రాండ్‌గా రిలీజ్‌ కానుంది. అయితే తెలుగు రిలీజ్‌పై ఇంకా క్లారిటీ లేదు. ఈ సినిమా కన్నడ బ్లాక్‌ బస్టర్‌ అయిన మఫ్టీకి రీమేక్‌గా తెరకెక్కింది. కన్నడలో శివరాజ్‌కుమార్‌ పోషించిన రౌడీ పాత్రను శింబు పోషించాడు. ఒక రౌడీ గురించి ఎంక్వైరీ చేయడానికి మఫ్టీలో వచ్చిన పోలీస్‌ అధికారి, ఆ రౌడీ గురించి ఏం తెలుసుకున్నాడు. అసలు ఆ రౌడీ కథేంటీ అనే నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కింది. టైటిల్‌ పోస్టర్‌ నుంచి సినిమాపై ఎక్కడలేని బజ్‌ క్రియేట్‌ అయింది. ఇక టీజర్‌తో సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి.

YouTube video
Advertisement

తాజా వార్తలు

Advertisement