Friday, May 3, 2024

దూసుకుపోతోన్న ప‌ఠాన్.. 19రోజుల్లో రూ.950కోట్లు

విడుద‌ల‌కి ముందే ఎన్నో వివాదాలు ఎదుర్కొన్న ప‌ఠాన్ చిత్రం వ‌సూళ్ల‌తో దూసుకుపోతోంది. కాగా బాలీవుడ్ స్టార్ హీరో షారుక్ ఖాన్ కెరీర్ లో అతి పెద్ద విజ‌యాన్ని న‌మోదు చేసింది ఈ చిత్రం. కేవలం 19 రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రం రూ.950 కోట్ల వసూళ్లను సాధించింది. వెయ్యి కోట్ల మార్కు అందుకునేందుకు చేరువైంది. రెండు వారాంతాలు పూర్తయినా బాక్సాఫీస్‌ వద్ద ఈ సినిమా జోరు కొనసాగుతూనే ఉంది. ఈ ఆదివారం కూడా ఈ చిత్రం రూ. 12.50 కోట్లు రాబట్టింది.భారత్‌తో పాటు విదేశాల్లోనూ ‘పఠాన్‌’ జోరు కొనసాగుతోంది. మరికొన్ని రోజుల్లో ఈ చిత్రం వెయ్యి కోట్ల క్లబ్ చేరనుంది. బాహుబలి రికార్డును కూడా బ్రేక్ చేస్తుందని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు. సిద్ధార్థ్‌ ఆనంద్‌ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో షారుఖ్‌ఖాన్‌ గూఢచారిగా నటించారు. దీపికా పదుకొన్, జాన్ అబ్రహం కీలక పాత్రలు పోషించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement