Sunday, May 5, 2024

ఆస్ట్రేలియా జట్టు కెప్టెన్‌ పాట్‌ కమిన్స్‌ తల్లి మారియా కన్నుమూత

ఆస్ట్రేలియా జట్టు కెప్టెన్‌ పాట్‌ కమిన్స్‌ తల్లి మారియా కమిన్స్‌ శుక్రవారం తెల్లవారుజామున కన్నుమూశారు. ఈ విషయాన్ని క్రికెట్‌ ఆస్ట్రేలియా ట్విటర్‌ వేదికగా అధికారికంగా ద్రువీకరించింది. కొంతకాలంగా క్యాన్సర్‌ మహమ్మారితో పోరాటం చేస్తున్న ఆమె శుక్రవారం తెల్లవారుజామున తుదిశ్వాస విడిచారని క్రికెట్‌ ఆస్ట్రేలియా తెలిపింది.

పాట్‌ కమిన్స్‌ తల్లి మృతిపై బీసీసీఐ సహా టీమిండియా ఆటగాళ్లు తమ సంతాపాన్ని ప్రకటించారు. ”ఈ విషాద సమయంలో ‍ కమిన్స్‌, అతని కుటుంబసభ్యులుకు మా సానుభూతి తెలియజేస్తున్నాం” అంటూ ట్వీట్‌ చేశారు

మారియా కమిన్స్‌ చనిపోవడం చాలా బాధాకారం. క్రికెట్‌ ఆస్ట్రేలియా తరపున పాట్‌ కమిన్స్‌, అతని కుటుంబసభ్యులకు మా ప్రగాడ సానభూతి. కమిన్స్‌ తల్లి మృతికి సంతాపంగా టీమిండియాతో నాలుగో టెస్టు రెండో రోజు ఆటలో ఆసీస్‌ క్రికెటర్లు నల్ల రిబ్బన్లతో(బ్లాక్‌ ఆర్మ్‌ బాండ్స్‌) బరిలోకి దిగుతారు.. ” అంటూ ట్వీట్‌ చేసింది.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement