Monday, May 6, 2024

జంతర్ మంతర్ వద్ద కవిత దీక్ష ప్రారంభం

న్యూ ఢిల్లీ – మహిళా రిజర్వేషన్ బిల్లును పార్లమెంట్‌లో ప్రవేశపెట్టి.. ఆమోదింపజేయాలని డిమాండ్ చేస్తూ . బీఆర్ఎస్ పార్టీ.. ఎం ఎల్ సి ఢిల్లీ జంతర్ మంతర్ దగ్గర ధర్నా చేపట్టారు. .. ఉదయం 10.15కి జంతర్ మంతర్‌ ప్రాంగణంలో నిరాహార దీక్ష ప్రారంభించారు. ముందుగా స్వాతంత్ర్య సమరయోధుల విగ్రహాలకు పూలమాలలు వేసిన ఆమె… ఆ తర్వాత దీక్షా స్థలి దగ్గర కూర్చున్నారు. భారత జాగృతి సంస్థ ఈ దీక్షను నిర్వహిస్తోంది. దీనికి సీపీఐ , సీపీఎంతోపాటూ… ఎన్సీపీ , టీఎంసీ, సమాజ్‌ వాదీ పార్టీ, డీఎంకే , ఆప్ , నేషనల్‌ కాన్ఫరెన్స్, శివసేన , పీడీపీ, జేడీయూ, ఆర్జేడీ, అకాలీదళ్, ఆర్‌ఎల్డీ, జేఎమ్‌ఎమ్‌ సహా 18 పార్టీలు సంఘీభావం ప్రకటించాయి. సాయంత్రం 4 గంటల వరకు ఈ దీక్ష కొనసాగనుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement