Friday, April 26, 2024

ఫ‌లానా అబ్బాయి ఫ‌లానా అమ్మాయి నుండి మ‌రో ట్రైల‌ర్

హీరో నాగ‌శౌర్య తాజా చిత్రం ఫ‌లానా అబ్బాయి ఫ‌లానా అమ్మాయి. హీరోయిన్ గా మాళవిక నాయర్ జంటగా న‌టించారు. ఈ చిత్రం నుండి మ‌రో ట్రైల‌ర్ ని రిలీజ్ చేశారు.. విశ్వప్రసాద్ – దాసరి పద్మజ నిర్మించిన ఈ సినిమాకి, శ్రీనివాస్ అవసరాల దర్శకత్వం వహించారు. హీరోయిన్ .. హీరోను అనుమానించే ఒక సీన్ పై కట్ చేసిన ఈ ట్రైలర్ ఆకట్టుకుంటోంది. ప్రేమ .. పెళ్లి .. అలకలు .. బుజ్జగింపులను కలుపుకుంటూ వెళ్లే కథలా ఈ సినిమా కనిపిస్తోంది. కల్యాణి మాలిక్ స్వరపరిచిన పాటలు ఇప్పటికే బాగా పాప్యులర్ అయ్యాయి. మార్చి 17న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. శ్రీనివాస్ అవసరాల మార్క్ మూవీ కావడంతో, టైటిల్ దగ్గర నుంచే పాజిటివ్ బజ్ మొదలైంది. ఈ సినిమా ఎలాంటి ఫలితాన్ని రాబడుతుందనేది చూడాలి.

YouTube video
Advertisement

తాజా వార్తలు

Advertisement