Wednesday, May 15, 2024

ఆదివారం రోజు లాక్‌డౌన్

మధ్యప్రదేశ్‌లో కరోనా కేసులు పెరుగుతుండటంతో ప్రభుత్వం అప్రమత్తమైంది. దీంతో ఈనెల 21న ఆదివారం నాడు మూడు నగరాల్లో లాక్‌డౌన్ విధించాలని సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు ఇండోర్, భోపాల్, జబల్‌పూర్ నగరాల్లో ఒక్కరోజు లాక్‌డౌన్ విధించాలని అధికారులకు సూచించారు. అటు ఈ నెల 31 వరకు రాష్ట్రంలోని అన్ని పాఠశాలలు, కళాశాలలను మూసివేయనున్నారు. మధ్యప్రదేశ్‌లో గడిచిన 24గంటల్లో 1140 పాజిటివ్ కేసులు, ఏడు మరణాలు నమోదయ్యాయి. తాజా కేసులతో కలిపి రాష్ట్రంలో మొత్తం పాజిటివ్‌ కేసుల సంఖ్య 2,73,097కి చేరింది. వీరిలో 2,62,587 మంది కోలుకోగా.. 3901మంది మృతిచెందారు. ప్రస్తుతం 6609 క్రియాశీల కేసులు ఉన్నాయి. వీటిలో ఇండోర్‌లో అత్యధికంగా 1960 కేసులు నమోదు కాగా భోపాల్‌లో 1492, జబల్‌పూర్‌లో 401 చొప్పున యాక్టివ్‌ కేసులు కేసులు ఉన్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement