Monday, May 6, 2024

57 దేశాల్లో ఒమిక్రాన్‌ వ్యాప్తి.. ప్రపంచ ఆరోగ్యసంస్థ హెచ్చరిక..

ప్రపంచంలో ఒమిక్రాన్‌ వేగంగా వ్యాపిస్తోందని, ప్రస్తుతం 57 దేశాల్లో ఈ కొత్త వేరియంట్‌ కేసులు నమోదయ్యాయని, మునుముందు మరింతగా వ్యాపిస్తుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ తాజాగా హెచ్చరించింది. అయితే గత వేరియంట్లతో పోలిస్తే ఎంత ప్రమాదకరమైనది, వ్యాక్సిన్ల ప్రభావాన్ని తట్టుకుంటుందా లేదా అన్ని విషయంపై ఇంకా పరిశోధనలు, విశ్లేషణలు సాగుతున్నాయని, మరింత డేటాను పరిశీలించాకే ఈ విషయంలో స్పష్టత వస్తుందని పేర్కొంది.

ఈ కొత్త వేరియంట్‌ ప్రమాదకరమైనదేనని, తేలిగ్గా తీసుకోవద్దని నవంబర్‌ 26న అధికారికంగా ప్రకటించిన ప్రపంచ ఆరోగ్య సంస్థ దాని ప్రభావంపై పరిశోధనలు కొనసాగిస్తోంది. ద.ఆఫ్రికాలోని ఎస్వాటిని, జింబాబ్వే, మొజాంబిక్‌, నమీబియా, లెసోతో వంటి దేశాల్లో కేవలం వారం రోజుల్లో 62,000 కేసులు నమోదయ్యాయని, ఇది కేసుల వ్యాప్తి ఎంత వేగంగా ఉందో సూచిస్తోందని తెలిపింది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement