Wednesday, May 8, 2024

250 ఏళ్ల క్రితం త‌యారు చేసిన మద్యం బాటిల్ ఖరీదు కోటి

విస్కీ బాటిల్ ధర ఎంత ఉంటుందంటే ఎవరైన ఏం చెబుతారు.. ఓ వెయ్యి రూపాయలు.. కొద్దిగా బ్రాండ్ వాల్యూ ఉన్న బాటిల్ అయితే ఓ పది వేలు ఉంటుందని చెబుతారు.. ఇక ఫారిన్ బ్రాండ్ ల గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు..కంపెనీలను బట్టి 50 వేల నుంచి లక్ష రూపాయల వరకు ఉండొచ్చు కాని…ఓ మద్యం బాటిల్ విలువ కోటి రూపాయలు ఉంటుందని ఎవరైనా ఊహించగలరా.. అవును ఇంగ్లాండ్‌లోని ప్ర‌ముఖ వేలం సంస్థ స్కినార్ ఇంక్ బాటిల్‌ను వేలం నిర్వ‌హించగా మిడ్‌టౌన్ మ‌న్హాట‌న్ మ్యూజియం, ది మోర్గాన్ ప‌రిశోధ‌న సంస్థ క‌లిసి ఈ బాటిల్‌ను 1,37,500 డాల‌ర్ల‌కు కోనుగోలు చేసింది. అంటే మన కరెన్సీరలో 1 కోటి రూపాయలు విలువ. అయితే ఇది మాములు విస్కీ బాటిల్ కాదంట…సుమారు 250 ఏళ్ల క్రితం త‌యారు చేశారట ఈ బాటిల్ ని.  ఈ విస్కి బాటిల్ పేరు ఓల్డ్ ఇంగ్లెడ్వ్‌.  దీనిని 1860 వ సంవ‌త్స‌రంలో త‌యారు చేశారు. ఇన్ని సంవత్సరాలు దాన్ని అలాగే ఉంచడంతో.. అనుకున్న ధ‌ర కంటే ఆరురెట్లు అధిక ధ‌ర‌ల‌కు అమ్ముడైంద‌ని వేలం సంస్థ ప్ర‌క‌టించింది.

ఇది కూడా చదవండి : రేపటి నుంచే పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు

Advertisement

తాజా వార్తలు

Advertisement