Tuesday, April 23, 2024

అన్నమయ్య కీర్తనలు : అంగన

రాగం : సురటి

అంగన లీరె యారతులు
అంగజ గురునకు నారతులు || అంగన ||

శ్రీదేవి తోడుత చెలగుచు నవ్వే
ఆదిమ పురుషుని కారతులు
మేదినీ రమణి మేలము లాడేటి
ఆదిత్య తేజున కారతులు || అంగన ||

సురలకు నమృతము సొరిది నొసంగిన
హరికిది వో పసిడారతులు
తరమిది దుష్టుల దనుజుల నడచిన
అరిభయంకరున కారతులు || అంగన ||

నిచ్చలు కళ్యాణ నిధియై యేగేటి
అచ్చుతునకు నివె యారతులు
చొచ్చి శ్రీ వేంకటేశుడు నలమేల్మంగ
యచ్చుగ నిలిచిరి యారతులు || అంగన ||

Advertisement

తాజా వార్తలు

Advertisement