Wednesday, May 15, 2024

Delhi | పాత పెన్షన్ స్కీం ప్రవేశపెట్టాలి.. కేంద్రం దృష్టికి టీచర్ల సమస్యలు

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ : కంట్రిబ్యుటరీ పెన్షన్ స్కీమ్ రద్దు చేసి పాత పెన్షన్  స్కీంను మళ్లీ ప్రవేశపెట్టాలని ఏబీఆర్‌ఎస్‌ఎం రాష్ట్ర అధ్యక్షులు శ్రావణ్ కుమార్ డిమాండ్ చేశారు. టీచర్ల సమస్యలను కేంద్ర ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లడానికి ఢిల్లీ వచ్చిన ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయుల సంఘం బృందం బుధవారం పలువురు ఎంపీలను కలిసి తమ ఇబ్బందులను వారికి వివరించారు. తమ సమస్యల పరిష్కారానికి సహకరించాలని కోరారు. అనంతరం వారు న్యూఢిల్లీలోని ఏపీ భవన్‌లో విలేకరుల సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా శ్రావణ్ కుమార్ మాట్లాడుతూ… ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయుల సంక్షేమం కోసం పని చేస్తుమన్నాని చెప్పారు. సంసద్ సంపర్క్ యోజన కింద లోక్‌సభ, రాజ్యసభ సభ్యులను కలవాలని నిర్ణయించుకున్నామని తెలిపారు. ఇందులో భాగంగా ఇప్పటివరకు విజయసాయి రెడ్డి, మిథున్ రెడ్డి, రామ్మోహన్ నాయుడు, కనకమేడల రవీంద్ర కుమార్‌తో పాటు 20 మంది ఎంపీలను కలిశామని చెప్పారు.

సంస్థాగత విస్తరణ, సంస్థలు చేస్తున్న కార్యక్రమాలతో పాటు ఆంధ్రప్రదేశ్‌లో ఉపాధ్యాయులకు ఉన్న రెండు ప్రధాన సమస్యలను కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వ దృష్టికి తీసుకువెళ్లడానికి ఢిల్లీ వచ్చామని వెల్లడించారు. ఒకే వేతనం పొందుతున్న ప్రభుత్వ, జిల్లా పరిషత్ మున్సిపల్, గిరిజన స్కూళ్లలో పనిచేసే టీచర్లందరికి ఏకీకృత సర్వీస్ రూల్స్ ద్వారా ఉమ్మడి సర్వీస్ రూల్స్‌తో ఒక విధానాన్ని అవలంభించాలని విన్నవించామన్నారు. 2017 జూన్‌లో భారతదేశ ప్రభుత్వం ఓ గెజిట్ తీసుకొచ్చిందని, కొన్ని సవరణలు చేసి ఉమ్మడి సర్వీసులకు అనుగుణంగా సవరణ ఉత్తర్వులు ఇవ్వాలని ఆయన కోరారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement