Friday, May 3, 2024

ఏప్రిల్‌లో ఇంధన అమ్మకాలు డౌన్‌.. 15 రోజుల్లో 15.6 శాతం క్షీణత

ఇంధన ధరలు భారీగా పెరిగిపోయాయి. గత 10 రోజులుగా మాత్రం స్థిరంగానే ఉన్నాయి. 17 రోజుల వ్యవధిలో 14 సార్లు పెట్రోల్‌, డీజెల్‌ ధరలు పెరిగాయి. మార్చిలో ఇంధన వినియోగం భారీగా పెరిగింది. అయితే ఏప్రిల్‌కి వచ్చేసరికి అంతే భారీగా పడిపోయింది. మార్చితో పోల్చుకుంటే.. ఏప్రిల్‌ 1 నుంచి 15వ తేదీ వరకు చోటు చేసుకున్న అమ్మకాల్లో 10 శాతం మేర క్షీణత నమోదైంది. డీజెల్‌ వినియోగంలో ఈ సంఖ్య భారీగా పెరిగింది. డీజెల్‌ అమ్మకాలు 15.6 శాతం మేర తగ్గిపోయాయి. పెట్రోల్‌, డీజెల్‌తో పాటు వంట గ్యాస్‌ వినియోగం కూడా తగ్గింది.

1.7 శాతం మేర సిలిండర్ల బుకింగ్‌లో తగ్గుదల కనిపించింది. కరోనా వైరస్‌ వ్యాప్తి చెందిన సమయంలో వంట గ్యాస్‌ వినియోగం భారీగా పెరిగిన విషయం తెలిసిందే. కంప్రెస్డ్‌ నేచురల్‌ గ్యాస్‌, పైప్డ్‌ నేచురల్‌ గ్యాస్‌ రేట్లను కేంద్ర ప్రభుత్వం భారీగా పెంచుతూ వచ్చింది. గృహ అవసర వినియోగదారులను సైతం వదల్లేదు. కమర్షియల్‌ సిలిండర్లపైనా భారం మోపింది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement