Friday, May 17, 2024

నిలకడగా చమురు ధరలు..

కొంత కాలంగా అంతర్జాతీయ స్థాయిలో ముడి చమురు ధరలు నిలకడగా ఉన్నందున ధరలు స్థిరంగానే ఉన్నాయి. దేశ రాజధాని ఢిల్లిలో లీటర్‌ పెట్రోల్‌ రూ.105.41 పైసలు, డీజెల్‌ రూ.96.67 పలుకుతున్నది. అయితే మార్చిలో ఇంధనాన్ని భారీగా వినియోగించిన ప్రజలు.. ఏప్రిల్‌లో జాగ్రత్త పడినట్టు తెలుస్తున్నది. ఇంధన ధరల కారణంగా ప్రయాణాలు మానుకోవడం లేదా ప్రజా రవాణాపై ఆధారపడటం చేసినట్టు తెలుస్తున్నది. అందుకే పెట్రోల్‌ అమ్మకాల్లో భారీ క్షీణత నమోదైనట్టు సమాచారం. ఫలితంగా రాష్ట్ర ప్రభుత్వాల ఆదాయం తగ్గిందనే చెప్పుకోవాలి.

అయితే ఈ పరిస్థితి ఎక్కువ కాలం ఉండదని, మార్చితో పోలిస్తే ఏప్రిల్‌ తొలి 15 రోజుల్లోనే విక్రయాలు తగ్గాయని మార్కెట్‌ నిపుణులు చెబుతున్నారు. వ్యక్తిగత వాహనాలపై పర్యాటక కేంద్రాలకు వెళ్లే వారిపైనా ఇది ప్రభావం చూపింది. ఫలితంగా పర్యాటక రంగం దెబ్బతినే ప్రమాదం ఉందని మార్కెట్‌ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement