Friday, April 26, 2024

అయ్యో అయ్యయ్యో.. ల‌క్ష‌లాది మద్యం బాటిళ్లు ఓ వైపు.. రోడ్ రోల‌ర్‌ మరో వైపు.. కట్ చేస్తే…!

మందు తాగేటప్పుడు ఒక్క చుక్క కింద పడినా గుండె ఆగినంతపని అవుతుంది. ఇక గ్లాసుల్లో మందు పోసేటప్పుడు ప్రతి ఒక్కరూ సైంటిస్టే. జాగ్రత్తగా కొలిచి, ఎక్కువ తక్కువ రాకుండా గ్లాస్ లో పోస్తారు. ఇలా ఒక్క చుక్క మద్యాన్నైనా వదలని మద్యం ప్రియులు ఈ వార్త చ‌దివితే ఏమైపోతారో.. అయ్యో అయ్యో అంటూ నాలుక చప్పరించుకోవడం తప్పు వారేమీ చేయలేని పరిస్థితి వస్తే ఆ బాధను మాటల్లో వర్ణించలేం. తాజాగా అక్రమంగా స్వాధీనం చేసుకున్న మద్యాన్ని పోలీసులు రోడ్ రోల‌ర్ తో తొక్కించారు.

ఎన్టీఆర్‌ జిల్లా నందిగామ డివిజన్ పరిధిలో భారీగా మ‌ద్యం బాటిళ్ల‌ను ఆబ్కారీ అధికారులు ధ్వంసం చేశారు. దాదాపు 2 లక్షల 43 వేల మద్యం సీసాలను రోడ్ రోల‌ర్ తో తొక్కించారు. వాటి విలువ రూ.5 కోట్ల 47 లక్షలు ఉంటుందని పేర్కొన్నారు. డివిజన్ వ్యాప్తంగా మొత్తం 6075 అక్రమ మద్య కేసులు కాగా పట్టుకున్న మద్యం సీసాలను ఆయా పోలీస్ స్టేషన్లలో భద్రపరిచారు. వీటిని ఇవాళ అన్ని పోలీస్ స్టేషన్ల పరిధిలో రోడ్ రోలర్ ద్వారా మద్యాన్ని పోలీసులు ధ్వంసం చేశారు. తెలంగాణ రాష్ట్రం నుంచి అక్రమంగా ఏపీకి తరలిస్తుండగా పట్టుబడిన మద్యం విలువ రూ.5.5 కోట్లుగా ఉంటుందని విజయవాడ సీపీ వెల్లడించారు. పెనుగంచిప్రోలు మండలం తోటచెర్ల వద్ద ప్లాట్లలో పోలీస్ కమిషనర్ క్రాంతి రాణ టాటా, డీసీపీ మేరి ప్రశాంతి సమక్షంలో మద్యం సీసాలను ధ్వంసం చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement