Sunday, April 28, 2024

భార‌త్‌లోనే వ‌న్డే వ‌ర‌ల్డ్ క‌ప్‌.. స‌న్నాహాలు చేస్తున్న బీసీసీఐ

ODI వ‌ర‌ల్డ్ కప్-2023 ఈ ఏడాది అక్టోబర్-నవంబర్ మధ్య జరగనుంది. ఈ మెగా టోర్నీకి భారత్ ఆతిథ్యం ఇవ్వనుండ‌గా.. ఐసీసీ ముసాయిదా షెడ్యూల్ ప్రకారం అక్టోబర్ 5 నుంచి ఈ మెగా టోర్నీ ప్రారంభం కానున్న‌ట్టు స్ప‌ష్ట‌మ‌వుతోంది. ఈ క్రమంలో టోర్నీలో పాల్గొనే జట్లకి సంబందించిన‌ పూర్తి వివరాలను ప్రకటించేందుకు ఆగస్టు 29వ తేదీని డెడ్ లైన్ గా ఐసీసీ ఇదివ‌ర‌కే నిర్ణయించింది. దీంతో ఆయా క్రికెట్ బోర్డులు తమ జట్లను ఖరారు చేసి వివరాలను సమర్పించేందుకు దాదాపు రెండు నెలల సమయం మాత్రమే మిగిలి ఉంది.

- Advertisement -

మరో 60 రోజులు..

ఈ మెగా టోర్నీలో పాల్గొనే జట్లు తమ వివరాలను సమర్పించేందుకు 60 రోజుల సమయం ఉంది. అయితే తాజాగా బీసీసీఐ కొత్త చీఫ్ సెలక్టర్ పదవికి దరఖాస్తులను ఆహ్వానించింది. అంటే చీఫ్ సెలక్టర్‌ను నియమించేందుకు బోర్డుకు ఇంకా 60 రోజుల సమయం ఉంది. ఇటీవల ఫిబ్రవరిలో చేతన్ శర్మ సెలెక్టర్ పదవికి రాజీనామా చేశారు. ఆ తర్వాత నాలుగు నెలల పాటు ఆ పదవిలో ఎవరూ లేరు. కుర్చీ ఖాళీగా ఉంది. తరువాత, చేతన్ శర్మ స్థానంలో సెలక్షన్ ప్యానెల్ సభ్యుడు శివసుందర్ దాస్‌ను బోర్డు తాత్కాలిక సెలెక్టర్‌గా ఎంపిక చేసింది. ఈ ఏడాది ఆగస్టు-సెప్టెంబర్ మధ్య జరిగే ఆసియాకప్‌కు ముందే కొత్త చీఫ్ సెలక్టర్‌ను ఎంపిక చేసే పనిలో బీసీసీఐ నిమగ్నమై ఉంది..

Advertisement

తాజా వార్తలు

Advertisement