Saturday, May 4, 2024

‘ఓసీఎఫ్ఎస్’ టీజ‌ర్ రిలీజ్ చేసిన నాని..నవంబర్ 19న జీ5లో

ఓసీఎఫ్ఎస్ (ఒక చిన్న ఫ్యామిలీ స్టోరీ ) టీజ‌ర్ ని రిలీజ్ చేశాడు నేచుర‌ల్ స్టార్ నాని. ఈ వెబ్ సిరీస్ ని నాగ‌బాబు కుమారై..న‌టి నిహారిక నిర్మిస్తోంది. కాగా ఈ వెబ్ సిరీస్ జీ5లో న‌వంబ‌ర్ 19న రిలీజ్ కానుంది. ఈ వెబ్ సిరీస్ నిడివి 40 నిమిషాలు..కాగా మొత్తం ఐదు ఎపిసోడ్స్ గా ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. ఇందులో సంతోష్ శోభన్, సిమ్రాన్ శర్మ హీరో హీరోయిన్లుగా న‌టిస్తున్నారు. సీనియర్ నటీనటులు నరేశ్, తులసి కీలక పాత్రలు పోషిస్తున్నారు. టీజ‌ర్ రిలీజ్ చేసిన నాని మాట్లాడుతూ.. కాగా ఇది ఒక చిన్న ఫ్యామిలీ స్టోరీ టీజ‌ర్. ఈ వెబ్ సిరీస్ బృందానికి నా బెస్ట్ విషెస్.. టీజ‌ర్ చాలా స‌ర‌దాగా ఉంద‌ని తెలిపాడు.

Advertisement

తాజా వార్తలు

Advertisement