Thursday, May 16, 2024

రైతులకు తప్పని ఇబ్బందులు… పెండింగ్ లో దరఖాస్తులు

ఇసుక రీచ్ అనుమతులకు అధికారుల నుంచి అడ్డంకులు ఎదురవుతున్నాయి. తెలంగాణరాష్ట్ర మినరల్ డెవలప్ మెంట్ కర్పోరేషన్ లిమిటెడ్ సంస్థతో పాటుగిరిజనుల సొసైటీలకు, రైతులు ద్వారా అగ్రిమెంట్ చేసుకుని రీచ్ అనుమతి కోసం దరఖాస్తు చేసుకునే వారికి గనులు, భూగర్భ శాఖ అధికారులు మోకాలడ్డుతున్నారన్నా ఆరోపణలు వినిపిస్తున్నాయి.కొత్తగా ఇసుక రీచ్ కోసం దరఖాస్తు చేసుకునే వారు గనులు, భూగర్భశాఖలతో
పాటు పీసీబీ ( కాలుష్య నియంత్రణ మండలి)కి దరఖాస్తు చేసుకుంటారు. అయితే దరఖాస్తు చేసుకున్న నాటి నుంచి మూడు, నాలుగేళ్ల వరకు అనుమతులు ఇవ్వకుండా ఆయా శాఖ అధి కారులు తాత్సారంచేస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.ఇసుకరీలకు సంబంధించిన దరఖాస్తులు తహసీల్దార్ నుంచి గనులు, భూగర్భ శాఖకు వెళ్లుతాయి. ప్రస్తుతం రెండు లేదా మూడు జిల్లాలను కలిపి (గనులు, భూగర్భశాఖ) ఒక్కో
ఏడీ మాత్రమే విధులు నిర్వహిస్తున్నారు.దీంతో వారు
చెప్పిందే వేదంగా నడుచుకోవాల్సి వస్తోందని సొసైటీలు, రైతులు, టీఎస్ఎండీసీ సంస్థ అధికారులు ఆరోపిస్తున్నారు.

ఇప్పటికే పలు జిల్లాల గనులు, భూగర్భశాఖ ఏడీలపై జిల్లాల కలెక్టర్లకు పెద్ద ఎత్తున ఫిర్యాదులువస్తున్నాయి. అయితే కలెక్టర్లకు వారిపైన చర్యలు తీసుకునే అధికారం లేకపోవడంతో వారు ఏమిచేయలేని స్థితిలో ఉండిపోతున్నారు. ప్రభుత్వ
ప్రధానకార్యదర్శిగా ఉన్న సోమేష్ కుమార్ వద్దే గనులు, భూగర్భ శాఖ కూడా ఉన్నది. జిల్లా కలెక్టరక్షకు చర్యలు తీసుకునేఅధికారంలలేకపోవడంతోనే సంబంధిత శాఖ అధికారులుఇష్టారాజ్యంగావ్యవహారిస్తున్నా రనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.చర్యలు తీసుకునే అధికారం జిల్లా కలెక్టర్లకు అప్పగిస్తే కొంత మేరకైనా అవినీతికి అడ్డుకట్ట వేయవచ్చని పలువురు పేర్కొంటున్నారు. ఇసుక ఎక్కువగా జయశంకర్ భూపాలపల్లి, ములుగు,భద్రాద్రి కొత్తగూడెం,మంచిర్యాల,పెద్దపల్లి జిల్లాలో దొరుకుతుంది.ఇక్కడే ఎక్కువగా ఇసుక రీచ్ల కోసం వివిధ సంస్థలు, వ్యక్తులు దరఖాస్తులు చేసుకుంటారు. ఈ నేపథ్యంలో ఇక్కడిపని చేస్తున్న అధికారులపైన కలెక్టర్లకు ఫిర్యాదులు అందుతున్నాయి. ఈ పిర్యాదులను కలెక్టర్లు కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లినట్లుగా తెలిసింది.

ప్రభుత్వం తీసుకునే నిర్ణయం ఆధారంగా చర్యలు తీసుకోవాలనే అభిప్రాయంతో కలెక్టర్లు ఉన్నట్లుగా తెలుస్తోంది. కొన్ని జిల్లాలలో ప్రయివేట్ పట్టా భూముల్లో ఇసుకను తవ్వుకోవడానికి అనుమతులు తొందరగా వస్తుండగా.. మరి కొన్ని జిల్లాలలో ఏళ్లతరబడి అనుమతులు రావడం లేదు. ఇసుక అమ్మకం ద్వారా 2014- 15 నుంచి 2020-21 ఆర్థిక సంవత్సరం వరకు అంటే ఈ ఆరేళ్ల కాలంలో టీఎస్ఎండీసీ రూ. 3,278,64 కోట్లఆదాయాన్ని సమకూర్చుకున్నది. అందుకు గాను మరిన్ని ఇసుక రీచ్లను గుర్తించిన టీఎస్ఎండీసీ అనుమతుల కోసం ఇబ్బందులు పడాల్సి వస్తుందని సంబంధిత అధికారులు చెబుతున్నారు. వందల సంఖ్యలో దరఖాస్తులు పెండింగ్.. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా టీఎస్ఎండీసీ సంస్థఆధ్వర్యంలో 40కి పైగా రీల నుంచి ఇసుక తవ్వకాలు జరుగుతున్నాయి.

ఇంకా20 నుంచి 25 దరఖాస్తులు చాలా కాలంగాపీసీబీతో పటు గనులు, భూగర్భ శాఖ వద్ద పెండింగ్ లోఉన్నట్లుగా సమాచారం. ఈ దరఖాస్తులు క్లియర్ కావాలంటేసంబంధిత శాఖ అధికారులకు ముడుపులు ముట్ట చెప్పుకోవాల్సిన పరిస్థితి వస్తుందని పలువురు అధికారులే ఆరోపిస్తున్నారు. ప్రభుత్వ రంగ సంస్థ అయిన టీఎస్ డీసీకే ఇలాంటి పరిస్థితి ఎదురైతే గిరిజన సొసైటీలు, రైతుల నుంచి అగ్రిమెంట్ చేసుకున్న వారి పరిస్థితి ఎలా ఉంటుందో సామాన్యుల పరిస్థితి ఎలా ఉంటుందో అర్థం చేసుకోవాల్సి ఉంటుందని చెబుతున్నారు. ఇక పీసీబీ అనుమతి కోసం దరఖాస్తు పెట్టుకున్నప్పుడు స్థానికంగా పీసీబీ గ్రామ సభలు నిర్వహించి స్థానికులు అభిప్రాయాలను స్వీకరిస్తుంది. అయితే గ్రామ సభల పేరుతో ఒక్కో రీచకు ఇంత ముట్టచెప్పాల్సిందేనని పీసీబీ అధికారులు ఒత్తిడి చేస్తారనే ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి. డబ్బులు ఇస్తేనే స్థానికులను మెప్పించి ఇసుక తవ్వకాలకు అనుమతులు వచ్చేలా చూస్తారని లేదంటే ఏదో ఒక కొర్రి పెట్టి అనుమతులురాకుండా చేస్తారని ఆరోపణలను పీసీబీ అధికారులుమూటగట్టుకుంటున్నారు. ప్రస్తుతం జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రికొత్తగూడెం, మంచిర్యాల, పెద్దపల్లి జిల్లాలలో 7ఇసుక రీచ్ కోసం పెట్టుకున్న వందల దరఖాస్తులు పెండింగ్ లోనే ఉన్నట్లుగా తెలిసింది. అవన్ని క్లియర్ కావాలంటే గనులు, భూగర్భ శాఖ అధికారులు అడిగినంత ఇచ్చుకోవాల్సిందేనని పలువురువాపోతున్నారు. గనులు, భూగర్భశాఖ అధికారులకు ఎంతో కొంత ముట్టజెప్పుకుని పీసీబీ అధికారులను విస్మరించినా కథ మళ్లీ మొదటికే వస్తుందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement