Sunday, May 5, 2024

మహిళా శిశు సంక్షేమ శాఖలో 181 ఉద్యోగాలకు నోటిఫికేషన్‌.. సెప్టెంబర్‌ 8 నుంచి దరఖాస్తుల స్వీకరణ

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ: తెలంగాణలో వరుసగా ఉద్యోగ నోటిఫికేషన్లు జారీ అవుతున్నాయి. ఇప్పటికే గ్రూప్‌-1, ఎస్‌ఐ, పోలీసు కానిస్టేబుల్‌ ఉద్యోగాలతో పాటు మరికొన్ని ఉద్యోగాలకు నోటీఫికేషన్లు జారీ చేసిన ప్రభుత్వం తాజాగా మరో నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. మహిళా, శిశు సంక్షేమ శాఖలో 181 ఉద్యోగాల భర్తీకి టీఎస్‌పీఎస్‌సీ నోటిఫికేషన్‌ జారీ చేసింది. గ్రేడ్‌-1 ఎక్స్‌టెన్షన్‌ ఆఫీసర్‌ (సూపర్‌వైజర్‌) పోస్టుల భర్తీ చేపట్టనున్నారు. అర్హులైన మహిళా అభ్యర్థుల నుంచి సెప్టెంబర్‌ 8 నుంచి 29వ తేదీ వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులను స్వీరించనున్నట్లు టీఎస్‌పీఎస్‌సీ తెలిపింది. ఇతర వివరాలకు వెబ్‌సైట్‌ను సందర్శించాలని టీఎస్‌పీఎస్‌సీ సూచించింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement