Monday, May 6, 2024

బ్లూ జీన్స్ ధ‌రిస్తే…క‌ఠిన‌మైన శిక్ష‌..!

ఉత్త‌ర కొరియాలో ఎట్టిప‌రిస్థితుల్లో బ్లూక‌ల‌ర్ జీన్స్ ధ‌రించ‌కూడ‌దని అక్కడి ప్రభుత్వం కఠిన నిబంధనలు విధించింది. మొన్నటి వరకు ఉత్తర కొరియాలో అసలు జీన్సే ధరించకూడదనే ఆంక్షలు ఉండేవి.. కొరియా సంస్కృతికి విరుద్ధంగా ప్ర‌జ‌లు ఎవ‌రూ కూడా దుస్తులు ధ‌రించ‌కూడదు.  పాశ్చాత్యపోక‌డ‌ల‌కు ఆ దేశం దూరంగా ఉంటుంది…బ‌ట్ట‌ల విష‌యంలో కిమ్ ప్ర‌భుత్వం చాలా సీరియ‌స్‌గా వ్వ‌వ‌హ‌రిస్తుంది. అయితే ఇప్పుడిప్పుడే ఆ దేశంలో జీన్స్ ల‌కు అనుమ‌తి ఇస్తున్నారు.  అయితే నీలి రంగు జిన్స్ ధరించకూడదని కఠిన ఆంక్షలు విధించారట అక్కడ..ఎందుకంటే ఆ రంగు అమెరికాను సూచిస్తుంద‌ట‌.  అమెరికా అంటే కొరియాకు అస్స‌లు ప‌డ‌దు.  కిమ్ పాల‌న మొద‌ల‌య్యాక రెండు దేశాల మ‌ధ్య దూరం మ‌రింత‌గా పెరిగింది.

ఇది కూడా చదవండి: ఆస్ట్రేలియాలో మళ్లీ మొదలైన లాక్‌డౌన్

Advertisement

తాజా వార్తలు

Advertisement