Friday, May 3, 2024

Delhi: స‌మ‌యం లేదు… జైలులో లొంగిపోవాల్సిందే…

బిల్కిస్ బానో కేసులో దోషులకు సుప్రీంకోర్టు బిగ్ షాక్ ఇచ్చింది. లొంగిపోవడానికి మరికొంత సమయం కావాలని 11 మంది దోషులు దాఖలు చేసిన పిటిషన్‌ను కొట్టివేసింది. జస్టిస్ బివి నాగరత్న నేతృత్వంలోని ధర్మాసనం పిటిషన్లలో న్యాయంలేదని పేర్కొంది. దోషులు ఆదివారం లోగా జైలులో లొంగిపోవాలని ఆదేశించింది.

బిల్కిస్ బానో కేసులో తాము లొంగిపోయే గడువును పెంచాలని కోరుతూ ముగ్గురు దోషులు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. నాలుగు నుంచి ఆరు వారాల పాటు పొడిగించాలని కోరుతూ పిటిషన్ దాఖలు చేశారు. పిటిషన్లను నేడు విచారించిన సుప్రీంకోర్టు స‌మ‌యం ఇవ్వ‌లేమ‌ని తేల్చి చెప్పింది.. ముందుగా నిర్ధారించిన తేది లోగా జైలులో లొంగిపోవాల్సిందేన‌ని తీర్పు ఇచ్చింది.. వివ‌రాల‌లోకి వెళితే… 2002లో గోద్రా రైలు దహనకాండ అనంతరం గుజరాత్‌లో అల్లర్లు జరిగినప్పుడు ఈ అఘాయిత్యం జరిగింది. బిల్కిస్‌ బానో కుటుంబానికి చెందిన ఏడుగురిని దుండగులు హత్య చేశారు.

ఆ సమయంలో ఐదు నెలల గర్భిణిగా ఉన్న బానోపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ కేసులో 11 మంది నిందితులకు సీబీఐ ప్రత్యేక కోర్టు 2008 జనవరి 21న జీవిత ఖైదు విధించింది. ఈ శిక్ష కాలాన్ని తగ్గిస్తూ గతేడాది ఆగస్టు 15న గుజరాత్ ప్రభుత్వం ముందస్తుగానే వీళ్లను విడుదల చేసింది. అయితే.. ఈ అధికారం గుజరాత్ ప్రభుత్వానికి లేదని పేర్కొంటూ సుప్రీంకోర్టు ఇటీవల సంచలన తీర్పు వెలువరించింది. దోషులు మళ్లీ జైలులో జనవరి 21లోగా లొంగిపోవాలని ఆదేశాలు జారీ చేసింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement