Thursday, May 2, 2024

నితిన్ ‘మాస్ట్రో’ ట్రైలర్ వచ్చేసింది

నితిన్ ఈ ఏడాది వరుసగా సినిమాలు చేస్తున్నాడు. ఈ నేపథ్యంలో నితిన్ నటించిన తాజా చిత్రం ‘మాస్ట్రో’. బాలీవుడ్ అంధాధున్‌కు రీమేక్‌గా తెరకెక్కిన ఈ మూవీకి మేర్లపాక గాంధీ దర్శకత్వం వహిస్తున్నాడు. నితిన్‌‌కు జంటగా నభా నటేశ్‌ జంటగా నటించగా.. మిల్కీ బ్యూటీ తమన్నా కీలక పాత్ర పోషించింది. శ్రేష్ట్ మూవీస్‌ పతాకంపై సుధాకర్‌రెడ్డి, నిఖితా రెడ్డి నిర్మించారు. ఈ చిత్రం ప్రముఖ ఓటీటీ హాట్‌స్టార్‌ వేదికగా త్వరలోనే స్ట్రీమింగ్‌ కానుంది. ఈ సందర్భంగా చిత్ర బృందం ట్రైలర్‌ను విడుదల చేశారు. బ్లాక్ కామెడీ క్రైమ్ థ్రిల్లర్‌గా వస్తున్న ఈ చిత్ర ట్రైలర్ ఆసక్తికరంగా సాగింది.

ప్రశాంతంగా మొదలైన ట్రైలర్.. ఆ తర్వాత మర్డర్ దాకా వెళ్ళింది. నితిన్ అంధుడిగా సంగీతం వాయిస్తూ నభాతో ప్రేమలో పడుతాడు. ఆపై తమన్నా ఎంట్రీ తరువాత సీన్ మారిపోతోంది. తమన్నా.. ఓ యువతిని బిల్డింగ్ మీద నుంచి తోసేయడం.. ఆ తర్వాత నితిన్ ఇంట్లోకి ఎంట్రీ ఇవ్వడంతో ట్రైలర్ ఆసక్తికరంగా మారింది. నితిన్ అంధుడి పాత్రలో అద్భుతంగా నటించగా.. నభా, తమన్నా అందాలు ఆకట్టుకుంటున్నాయి.

YouTube video

ఈ వార్త కూడా చదవండి: చిరంజీవి ‘భోళా శంకర్’ కొత్త రికార్డు

Advertisement

తాజా వార్తలు

Advertisement