Thursday, May 2, 2024

చిరంజీవి ‘భోళా శంకర్’ కొత్త రికార్డు

మెగాస్టార్ చిరంజీవి కొత్త చిత్రం ‘భోళా శంకర్’ టైటిల్ అనౌన్స్ మెంట్ ఆది నుంచే రికార్డులు ప్రారంభించింది. విడుదలైన కొన్ని గంటల్లోనే ఈ చిత్రం టైటిల్ రికార్డు సృష్టించింది. ట్విట్టర్ లో వేగంగా 1 మిలియన్ వ్యూస్ సాధించిన టైటిల్ వీడియోగా చిరంజీవి ‘భోళా శంకర్’ కొత్త రికార్డు నెలకొల్పింది. ఈ మేరకు చిత్ర నిర్మాణ సంస్థ ఏకే ఎంటర్టయిన్ మెంట్స్ వెల్లడించింది. చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా ఈ చిత్రం టైటిల్ వీడియోను సూపర్ స్టార్ మహేశ్ బాబు ఈ ఉదయం విడుదల చేశారు. కాగా, .తమిళంలో అజిత్ హీరోగా బ్లాక్ బస్టర్ హిట్టయిన వేదాళం రీమేక్ గా భోళా శంకర్ తెరకెక్కుతోంది. వేదాళంలో అజిత్, లక్ష్మీమీనన్ అన్నాచెల్లెళ్ల పాత్రల్లో నటించగా, తెలుగులో చిరంజీవి, కీర్తి సురేశ్ ఆ పాత్రల్లో కనువిందు చేయనున్నట్టు తెలుస్తోంది. ఈ చిత్రానికి మెహర్ రమేశ్ దర్శకత్వం వహిస్తున్నారు.

ఇది కూడా చదవండి: భారత్ కు వచ్చిన ఆఫ్ఘన్ ఎంపీ.. అంతా నాశనమైపోయిందంటూ కంటతడి

Advertisement

తాజా వార్తలు

Advertisement