Saturday, April 27, 2024

సెక్స్‌ ఆరోపణల్లో సాహిత్య అకాడమీ విజేత నీలోత్పల్‌

సాహిత్య అకాడమీ విజేత అయిన నీలోత్పల్‌ మ్రినయ్‌ సెక్స్‌ ఆరోపణలు ఎదుర్కొంటున్నాడు. తనను గత పదేళ్ల నుంచి నీలోత్పల్‌ అత్యాచారానికి పాల్పడుతున్నాడని 32 ఏళ్ల మహిళ ఢిల్లీ తిమ్మాపూర్‌ పోలీసులకు ఫిర్యాదు చేసింది. బాధితురాలు ఉత్తర ప్రదేశ్‌ గోరఖ్‌పూర్‌ వాస్తవ్యురాలు. దశాబ్దం క్రితం ఆమె ఢిల్లీకి వచ్చింది. అప్పటి నుంచి నీలోత్పల్‌ తనను పెళ్లి చేసుకుంటానని నమ్మించాడని ఆ మహిళ ఆరోపించింది. పదేళ్ల నుంచి అనేక సార్లు అత్యాచారం చేస్తున్నాడని, ప్రశ్నిస్తే చితక బాదేవాడని సదరు బాధిత మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసిన ఎఫ్‌ఐఆర్‌లో ఉంది. అతను ఇతర మహిళలు చాలామందితో లైంగిక సంబంధాలు కొనసాగిస్తున్నాడని ఆమె ఆరోపించింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement