Sunday, May 19, 2024

కొత్త ట్రెండ్ గురూ – విడాకుల‌కూ ప్రీ ఫోటో షూట్

ఇప్పుడో కొత్త ట్రెండ్ ప్రారంభ‌మైంది.. పెళ్లి కోసం ప్రీ షూట్ లు జోరుగా సాగుతున్న త‌రుణంలో తాజాగా విడాకుల‌కూ ప్రీ షూట్ కు ఉర‌క‌తెత్తుతున్నారు కొత్త‌త‌రం భామ‌లు .. అమెరికాకు చెందిన లారెన్ బ్రూక్ అనే మహిళ విడాకులు తీసుకున్న సందర్భంగా హ్యాపీగా ఫొటో షూట్ చేసుకుంది. పెళ్లి నాటి దుస్తుల్లో వచ్చిన లారెన్ బ్రూక్ వాటిని తీసేసి తగలబెడుతుంది. ఆ తర్వాత పెళ్లి నాటి ఫొటోలను చింపేసింది.. ఆల్బమ్ తగలపెట్టేసింది… ప్రేమ్​ ఫొటోలను కాళ్ల కింద పడేసి పగలగొట్టింది. పెళ్లి నాటి జ్ణాపకాలు అన్నింటినీ నాశనం చేసేసి హ్యాపీగా షాంపెయిన్ ఓపెన్ చేసి ఎంజాయ్ చేసింది లారెన్ బ్రూక్. చివరగా డ్రైవర్స్ డ్ అనే థ్రెడ్ చూపిస్తూ నవ్వులు చిందించింది… పెళ్లి నాటి కంటే డైవర్స్ ఫొటో షూట్ లో ఒంటరిగా బాగా ఎంజాయ్ చేశానని.. ఫొటోలు బాగా వచ్చాయంటూ తన ఇన్ స్ట్రాలో ఫొటోలను పోస్ట్ చేసింది లారెన్ బ్రూక్. ప్రపంచ వ్యాప్తంగా వైరల్ అయిన ఈ ఫొటోలపై నెటిజన్లు భిన్నంగా స్పందిస్తున్నారు. ఇప్ప‌టికే 10 ల‌క్ష‌ల లైక్స్ ఈ ఫోటోల‌కు వ‌చ్చాయి….

Advertisement

తాజా వార్తలు

Advertisement