Friday, May 17, 2024

భార‌త్ – అమెరికాల మ‌ధ్య స‌రికొత్త అధ్యాయం ప్రారంభం – న‌రేంద్ర‌మోడీ

వాషింగ్టన్‌: భారత్‌- అమెరికా సంబంధాల విషయంలో సరికొత్త, అద్భుతమైన ప్రయాణం మొదలైందని ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ పేర్కొన్నారు. అమెరికా పర్యటన చివరి రోజైన నేడు మోడీ వాషింగ్టన్‌లోని రోనాల్డ్ రీగన్ సెంటర్‌లో ప్రవాస భారతీయులను ఉద్దేశించి ప్రసంగించారు. ‘భారత్, అమెరికాలు కలిసి విధానాలు, ఒప్పందాలు రూపొందించడమే కాదు.. జీవితాలు, కలలను, భవిష్యత్తును తీర్చిదిద్దుతున్నాయ’ని పేర్కొన్నారు. ఇరుదేశాల మధ్య సంబంధాలను బలోపేతం చేయడంలో ప్రవాస భారతీయుల పాత్రను ప్రశంసించారు. ‘భారత్‌, అమెరికాల మధ్య భాగస్వామ్యం 21వ శతాబ్దపు ప్రపంచాన్ని మెరుగుపరుస్తుంది. ఈ భాగస్వామ్యంలో మీరందరూ కీలక పాత్ర పోషిస్తారు. భారత అభివృద్ధికి అతిపెద్ద ప్రోత్సాహం దేశ ప్రజల ఆకాంక్షే. ఇది అమెరికాకు కూడా అపారమైన అవకాశాలను తెచ్చిపెడుతోంది. భారతీయ విమానయాన సంస్థలు అమెరికన్ కంపెనీలకు వందలాది విమానాలను ఆర్డర్ చేస్తున్నాయి. ఫలితంగా ఇక్కడ ఉద్యోగాలు వస్తున్నాయి’ అని ప్రధాని మోడీ పేర్కొన్నారు.

100కుపైగా భారతీయ కళాఖండాలను తిరిగి ఇచ్చేందుకు అమెరికా ప్రభుత్వం నిర్ణయించడంపై హర్షం వ్యక్తం చేశారు. కార్యక్రమం అనంతరం ఈజిప్టు పర్యటన కోసం కైరోకు బయలుదేరారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement