Monday, May 6, 2024

Karimnagar: రోహిత్ రావు హౌస్ అరెస్ట్

కరీంనగర్ నియోజకవర్గం నాయకులు ఎమ్మెస్సార్ మనుమడు మేనేని రోహిత్ రావు ఇంటివద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. చీకటి ఒప్పందాలపై తడిబట్టలతో మహాశక్తి దేవాలయంలో ప్రమాణం చేస్తానని పిలుపునిచ్చారు. ఈ క్రమంలో మహాశక్తి దేవాలయానికి బయలుదేరుతున్నారన్న సమాచారంతో పోలీసులు రోహిత్ రావును హౌస్ అరెస్ట్ చేశారు.

దీంతో రోహిత్ రావ్ ఇంటి వద్ద హైడ్రామా నెలకొంది. కాంగ్రెస్ శ్రేణులకు, పోలీసులకు మధ్య తీవ్ర తోపులాట జరిగింది. ఈ సందర్భంగా రోహిత్ రావు మీడియాతో మాట్లాడుతూ… రాష్ట్ర మంత్రి గంగుల కమలాకర్, బీజేపీ స్టేట్ చీఫ్ బండి సంజయ్ కుమార్ చీకటి ఒప్పందం చేసుకున్నారని ఆరోపించారు. గంగుల సహకారంతో బండి సంజయ్ వందల కోట్లు సంపాదించారని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. రోహిత్ రావును పోలీసులు అరెస్ట్ చేసి పిటిసి కి తరలించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement