Friday, May 3, 2024

నీరజ్‌ చోప్రా అరుదైన ఘనత.. లారెస్‌ వరల్డ్‌ స్పోర్ట్స్ అవార్డుకి నామినేట్​

టోక్యో ఒలింపిక్స్‌లో జావెలిన్‌ త్రోలో స్వర్ణంతో మెరిసిన నీరజ్‌ చోప్రా.. మరో ప్రతిష్టాత్మక అవార్డు అయిన లారెస్‌ స్పోర్ట్స్ నామినేట్‌ అయ్యాడు. మొత్తం ఏడు విభాగాల్లో అద్భుతమైన ప్రతిభ కనబర్చిన ఆటగాళ్లను ఈ అవార్డు కోసం నామినేట్‌ చేస్తుంటారు. ప్రతిష్టాత్మక లారెస్‌ వరల్డ్‌ స్పోర్ట్స్ అవార్డు నామినేషన్స్‌కు భారత్‌ తరఫున నామినేట్‌ అయిన మూడో అథ్లెట్‌గా నీరజ్‌ చోప్రా నిలిచాడు. ఇప్పటి వరకు వినేష్‌ ఫోగాట్‌, మాస్టర్‌ బ్లాస్టర్‌ సచిన్‌ నామినేట్‌ అయ్యారు. సచిన్‌ను ఈ అవార్డు కూడా వరించింది.

ఈ అవార్డు కోసం నీరజ్‌ చోప్రాతో పాటు రష్యన్‌ టెన్నిస్‌ ఆటగాడు.. తాజాగా నిర్వహించిన ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌ రన్నరప్‌ క్రీడాకారుడు డానియెల్‌ మెద్వెదేవ్, వెనిజులా అథ్లెట్‌ యులిమర్‌ రోజస్‌, బ్రిటన్‌ టెన్నిస్‌ స్టార్‌ ఎమ్మా రాడుక్కాను, స్పానిష్‌ ఫుట్‌బాలర్‌ పెడ్రీ, ఆస్ట్రేలియ సిమ్మర్‌ అరియార్నే టిట్మస్‌లు ఈ అవార్డుకు నామినేట్‌ అయ్యారు. ఓటింగ్‌ ప్రక్రియ ద్వారా ఏప్రిల్‌లో అవార్డు విజేతలను ప్రకటిస్తారు. ప్రపంచ వ్యాప్తంగా 1,300 మంది స్పోర్ట్‌ ్స జర్నలిస్టులు కలిసి.. ఏడు కేటగిరీల నుంచి ఆటగాళ్లను నామినేట్‌ చేశారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement