Thursday, April 25, 2024

బనీన్ కి తెలియకుండా డ్రాయర్ లాగేయాల.. అదిరా చీటింగ్ అంటే..

సిద్ధు జొన్నలగడ్డ.. ఈ మధ్య త‌న మాట‌ల‌తో బాగానే వైరలవుతున్నడు.. లేటెస్ట్‌గా పెద్ద ప్లానే వేశాడు.. DJ టిల్లు అని సినిమాతో జ‌నాల్లోకి దూసుకొస్తుండు. నిన్న‌ సినిమా థియేట్రికల్ ట్రైలర్ రిలీజ్ సంద‌ర్భంగా కూడా ఓ వివాదాస్ప‌ద వ్యాఖ్య చేసిన ఓ విలేక‌రికి టిల్లు అక్క‌డే చెక్ పెట్టేలా మాట్లాడాడు. అయితే ఆ విలేక‌రి చేసిన వ్యాఖ్య‌లు ఇప్పుడు సోష‌ల్ మీడియాలో హ‌ల్ చ‌ల్ అవుతున్నాయి. హీరోయిన్ పుట్టుమ‌చ్చ‌ల గురించి మాట్లాడుతుంటే.. ఇప్పుడెందుకులే అన్న‌ట్టు ఆ ముచ్చ‌ట‌ను దాట‌వేస్తాడు టిల్లు. అంతేకాకుండా ఓ రియాలిటీ షోలో కూడా త‌న‌దైన పంచుల‌తో జ‌నాల‌ను బాగా అట్రాక్ట్ చేశాడు.

ఇంత‌కీ టిల్లు ఏమంటుండో వాని మాట‌ల్ల‌నే చ‌దువుర్రి..

’’భలేటోడు వాడు.. మస్తుంటుది వాని కథ.

ఇంకెవడు మన సిద్ధుగాడిదేనే.

సిద్ధు.. హైదరాబాద్‌ లో డిజె.

- Advertisement -

పిలగాడు… తెల్లతోలు లేత పిల్ల నేహా శెట్టి తో భలే సరసాలు జేసిండులే.

అల్లు అర్జున్‌.. అర్జున్ కూడా మనోడితో సోపతి కోసం బట్టలు చించుకున్నాడంటే సమ్జతైలే… మనోడి టాలెంటేందో…

అరె బై వీడు మ్యూజిక్ డైరెక్టర్ ర్రా బై… అంటే తీన్ మార్ మ్యూజిక్ అనుకునేవు

దమ్ దమ్ చేస్తాడు మాస్ బీట్ తో.

అరె వీడు మ్యూజిక్ కంటే కామెడీతో మ్యాజిక్ ఎక్కువ జేస్తున్నాడ్రా… అనిపిస్తది ట్రైలరు చూస్తే

కానీ వాడు మనోడు… జెప్పినాక నమ్మాల గదా మల్ల.

వాడి పన్లో వాడుంటే… ఈ పిల్లోటి.. ఊరికే కెలుకుతుంటది. ఏంది రా టిల్లు అంటే… ఎవడు ఏం చేస్తున్నది ఎవడికీ తెలియదు రా బై ప్రతోడు తన యాంగిలో ఉన్నాడంటున్నాడు.

నీకో సంగత్జెప్తా ఇను…

సిద్ధు గాడు… అరిపించాడురా బై ఆ పోరితో. ఏం యాక్టింగ్ రా వాడిది… తలకాయ కూర తిని బాగా సోయొచ్చిందిరా వాడికి. కానీ కానీ… సిద్ధుగా దూసుకుపో.

మీకో సీక్రెట్ తెలుసా… ఈ సినిమాకు వీడు రైటర్ కూడారోయ్… కొంచెం మర్యాద పెంచుదామా…

సిద్ధు జొన్నలగడ్డ రైటర్ కూడా దీనికి.

11 వ తేదీ థియేటర్లలోకి వస్తోంది.. బీ రెడీ‘‘

Advertisement

తాజా వార్తలు

Advertisement