Saturday, May 4, 2024

అంటే సుందరానికీ..! సంగతేమిటీ..

శ్యామ్‌ సింగరాయ్‌తో విజయం అందుకున్న హీరో నాని కొత్త సినిమా ‘అంటే సుందరానికీ’. ఈ చిత్రానికి వివేక్‌ ఆత్రేయ దర్శకత్వం వహిస్తున్నారు. మైత్రీ మూవీస్‌ సంస్థ నిర్మిస్తోంది. ‘అంటే సుందరానికీ ‘ చిత్రం నుంచి జిరోత్‌ లుక్‌ పోస్టర్‌, వీడియోను విడుదల చేశారు. ఈ పోస్టర్‌లో నాని ఎరుపు చొక్క, పంచె కట్టులో కొత్త గెటప్‌లో కనిపిస్తున్నారు. ఆయన లగేజీ బ్యాగ్‌ మీద హనుమాన్‌ బొమ్మ ఉంది. ప్రవర శ్లోకం చదువుతూ ”కస్తూరి పూర్ణ వెంకట శేష సాయి పవన రామ సుందర ప్రసాద్” అని తన పేరును, హరితస అనే గోత్రాన్ని చెప్పుకున్నారు సుందరం. వెంటనే ‘వెల్‌ కమ్‌ టు ద వరల్డ్‌ ఆఫ్‌ సుందరం’ అంటూ ఆహ్వానించారు.

వినోదాత్మక కథనంతో ‘అంటే సుందారినికీ’ సినిమా ఉంటుందని అర్థమవుతోంది. నానికి ఈ సినిమా తప్పకుండా మరో డిఫరెంట్‌ మూవీ కానుంది. ఆవకాయ సీజన్‌లో అంటే సమ్మర్‌ విడుదలకు ‘అంటే సుందరానికీ’ థియేటర్లలో ప్రేక్షకుల ముందుకు రాబోతోందని ప్రకటించారు.

ఈ చిత్రం ద్వారా నజ్రియా నజిమ్‌ ఫహాద్‌ నాయికగా పరిచయం అవుతోంది. నికేత్‌ బొమ్మి సినిమాటోగ్రఫీ అందిస్తున్న ఈ చిత్రానికి వివేక్‌ సాగర్‌ సంగీతాన్ని అందిస్తున్నారు. రవితేజ గిరిజాల ఎడిటింగ్‌ బాధ్యతలు వహిస్తున్నారు. ఈ చిత్రానికి నిర్మాతలు: నవీన్‌ యేర్నేని, రవి శంకర్‌ వై, సీయీవో: చెర్రి.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement