Monday, May 6, 2024

ఉక్రెయిన్ పై రష్యా యుద్దానికి వంద రోజులు – అంతం ఎప్పుడో

ఈ ఏడాది ఫిబ్ర‌వ‌రి 24వ తేదీన ఉక్రెయిన్‌పై ర‌ష్యా సైనిక చ‌ర్య‌కు దిగింది..సివ‌రొడొన‌స్కీ సిటీలో తీవ్రంగా యుద్ధం జ‌రుగుతోంది. ప్ర‌స్తుతం ఆ భూభాగం ర‌ష్యా ద‌ళాల ఆధీనంలోనే ఉన్న‌ది. వైట్‌హౌజ్‌లో అధ్య‌క్షుడు జోబైడెన్‌తో భేటీ అయిన త‌ర్వాత నాటో చీఫ్ మీడియాతో మాట్లాడారు. ఉక్రెయిన్‌కు నాటో దేశాలు నిత్యం స‌పోర్ట్ ఇవ్వాల‌న్నారు. ఎందుకంటే ఆ యుద్ధం సుదీర్ఘంగా మారుతున్న‌ట్లు ఆయ‌న చెప్పారు. త‌మ దేశాన్ని ర‌క్షించుకునేందుకు ఉక్రెయిన్ భారీ త్యాగాల‌కు పాల్ప‌డుతోంద‌ని, మ‌రో వైపు ర‌ష్యా కూడా ఎక్కువ సంఖ్య‌లో సైనికుల్ని కోల్పోతున్న‌ట్లు జెన్స్ తెలిపారు. అయితే సుదీర్ఘ యుద్ధానికి స‌న్న‌ద్ద‌మై ఉండాల‌ని నాటో చీఫ్ జెన్స్ స్టోల్టెన్‌బ‌ర్గ్ చెప్పారు. ఇది ఎన్న‌టికీ ముగియ‌ని యుద్ధంగా మారుతున్న‌ట్లు ఆయ‌న అన్నారు. ఇక తూర్పు డాన్‌బాస్ ప్రాంతంలో ర‌ష్యా వ్యూహాత్మ‌క విజ‌యాన్ని సాధించిన‌ట్లు తెలుస్తోంది. కానీ ఆ దేశం భారీ మూల్యాన్ని చెల్లించుకున్న‌ట్లు బ్రిట‌న్ ఇంటెలిజెన్స్ ఆరోపిస్తోంది. ఉక్రెయిన్ భూభాగంలో 20 శాతం వ‌ర‌కు ప్ర‌స్తుతం ర‌ష్యా సైనిక ద‌ళాల ఆధీనంలో ఉన్న‌ట్లు అధ్య‌క్షుడు జెలెన్‌స్కీ తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement