Thursday, April 25, 2024

ఢిల్లీ వేదికగా జాతీయ బీసీ సంఘం ధర్నా

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ : వెనుకబడిన వర్గాల హక్కుల సాధన లక్ష్యంగా ఢిల్లీ వేదికగా జాతీయ బీసీ సంఘం ధర్నాకు సిద్ధమవుతోంది. ఆగస్టు 2, 3 తేదీల్లో జంతర్ మంతర్‌లో పెద్దఎత్తున ఆందోళన నిర్వహించనున్నట్టు జాతీయ బీసీ సంఘం అధికార ప్రతినిధి కర్రి వేణుమాధవ్ వెల్లడించారు. శనివారం ఏపీ భవన్‌లో మీడియాతో మాట్లాడుతూ చట్టసభల్లో బీసీలకు రిజర్వేషన్ల కల్పనకు డిమాండ్ చేయనున్నట్టు తెలిపారు. ఆర్టికల్ 340 ప్రకారం ఏ కుల జనాభా ఎంత ఉంటే అంత మందికి చట్టసభల్లో అవకాశం కల్పించాలని అంబేద్కర్ రాజ్యాంగంలో పొందుపరిచారని ఆయన చెప్పుకొచ్చారు.

జాతీయ బీసీ సంఘం అధ్యక్షులు ఆర్. కృష్ణయ్య నాలుగు దశాబ్దాలుగా 12 వేలకు పైగా ధర్నాలకు నేతృత్వం వహించి వెనుకబడిన వర్గాల పెద్దన్నగా నిలిచారని వేణు మాధవ్ హర్షం వ్యక్తం చేశారు. బీసీల గొంతుకగా రాజ్యసభ ఎంపీగా పార్లమెంట్‌లో అడుగు పెట్టిన కృష్ణయ్య బీసీల కులగణన, బీసీలకు ప్రత్యేక మంత్రిత్వ శాఖ, ఉద్యోగుల ప్రమోషన్లలో రిజర్వేషన్ల అంశంతో జంతర్ మంతర్‌లో జరిగే కార్యక్రమాల్లోనూ పాల్గొనవలసినదిగా విజ్ఞప్తి చేశారు.

- Advertisement -

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement