Thursday, May 16, 2024

ఈ సినిమా మీద నాకు నమ్మకం ఉంది – నాగశౌర్య

పీపుల్‌ మీడియా ఫ్యాక్టరీ, దాసరి ప్రొడక్షన్స్‌ సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం ‘ఫలానా అబ్బాయి ఫలానా అమ్మాయి’. టీ-జీ విశ్వ ప్రసాద్‌, పద్మజ దాసరి నిర్మిస్తున్నారు. సహ నిర్మాత వివేక్‌ కూచిభొట్ల . శ్రీనివాస్‌ అవసరాల దర్శకత్వం వహిస్తున్నారు. నాగశౌర్య, మాళవిక నాయర్‌ ఈ చిత్రంలో హీరో హీరోయిన్లుగా నటిస్తున్నారు.
నాగశౌర్య, శ్రీనివాస్‌ అవసరాల కలయికలో ఇది మూడో సినిమా ఇది. గతంలో ‘ఊహలు గుసగుస లాడే’, ‘జ్యో అచ్యుతానంద’ సినిమాలు వచ్చాయి. ఇప్ప టికే విడుదలైన ఫలానా అబ్బాయి ఫలానా అమ్మాయి ఫస్ట్‌ లుక్‌ కి ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభించింది. ఈ చిత్ర టీ-జర్‌ విడుదలైంది. హైదరాబాద్‌ లో జరిగిన టీ-జర్‌ విడుదల కార్యక్రమంలో నాగశౌర్య, మాళవిక నాయర్‌, దర్శకుడు శ్రీనివాస్‌ అవసరాల తదితరులు పాల్గొన్నారు.


టీ-జర్‌ విడుదల సందర్భంగా నాగశౌర్య మాట్లా డుతూ ” ఊహలు గుసగుసలాడే, జ్యో అచ్యుతానంద సినిమాల్లాగే ఈ సినిమా కూడా గుర్తుండిపోతుంది. ఈ సినిమా మీద నాకు చాలా నమ్మకముంది. కొన్ని సిని మాలు విడుదలై విజయం సాధించాక మనకు ఆనందం కలుగుతుంది. కానీ ఈ సినిమా మాత్రం విడుదల కాకముందే నేను చాలా ఆనందంగా ఉన్నాను. ఇలాంటి సినిమా మళ్ళీ నా జీవి తంలో చేయలేను. ” అన్నారు.
మాళవిక మాట్లాడుతూ ”-టైటిల్‌ ని బట్టే మీరు ఈ సినిమా ఎలా ఉండబోతుందో ఊహించవచ్చు. ఇది మీ ప్రేమ కథ అయ్యుండొచ్చు. మీ స్నేహితుల ప్రేమ కథ అ య్యుండొచ్చు. కానీ ఈ సంజయ్‌, అనుపమల ప్రేమ కథ చూడటం ఇంకా ఎక్కువ మజా వస్తుంది.” అన్నారు.
దర్శకుడు శ్రీనివాస్‌ అవసరాల మాట్లాడుతూ ” ఇది టీ-మ్‌ అంతా కలిసి చర్చించుకొని తీసిన సినిమా. సహజత్వానికి దగ్గరగా ఉండేలా తీశాం. సహజ సంభాషణలతో తీసిన సినిమా ఇది. మన చుట్టూ ఉండే మనుషుల మధ్య జరిగే కథ లాంటిది. ” అన్నారు.
చిత్ర నిర్మాతలు విశ్వప్రసాద్‌ తనయులు ప్రణవ్‌ విశ్వప్రసాద్‌, క్రితి విశ్వప్రసాద్‌ లు పాల్గొని చిత్ర విజయం పట్ల నమ్మకాన్ని వ్యక్తం చేశారు. మరో నిర్మాత పద్మజ దాసరి తనయులు దాసరి శ్రేయాస్‌ చిత్ర యూనిట్‌ కు శుభాకాంక్షలు తెలిపారు.
ఘనంగా జరిగిన ఈ వేడుకలో పాటల సంగీత దర్శకుడు కళ్యాణి మాలిక్‌, రచయితలు భాస్కరభట్ల, లక్ష్మీభూపాల, డీవోపీ సునీల్‌ కుమార్‌ నామ, నటీ-నటు-లు అభిషేక్‌ మహర్షి, శ్రీ విద్య, వారణాసి సౌమ్య చలంచర్ల, అర్జున్‌ ప్రసాద్‌, తదితరులు పాల్గొన్నారు .

Advertisement

తాజా వార్తలు

Advertisement