Tuesday, April 30, 2024

బీబీనగర్‌ ఎయిమ్స్‌లో 83 బోధన సిబ్బంది పోస్టులు ఖాళీ..

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ : తెలంగాణలోని బీబీనగర్‌ ఎయిమ్స్‌లో 183 బోధన సిబ్బంది పోస్టులకు గాను 83 పోస్టులు ఖాళీగా ఉన్నాయని కేంద్ర ఆరోగ్య శాఖ సహాయ మంత్రి భారతి పవార్‌ తెలిపారు. అలాగే, 971 బోధనేతర సిబ్బందికి గాను 636 ఖాళీలు ఉన్నట్లు వెల్లడించారు. ఈ మేరకు నల్గొండ పార్లమెంటు సభ్యుడు ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి శనివారం పార్లమెంటులో అడిగిన ప్రశ్నకు సమాధానంగా తెలిపారు. అలాగే, 24 గంటలు పనిచేసే పిహెచ్‌సిలు తెలంగాణలో 285 అంటే 49.3 శాతం ఉన్నాయని మల్కాజ్‌గిరి ఎంపి రేవంత్‌ రెడ్డి అడిగిన ప్రశ్నకు లిఖితపూర్వక సమాధానంగా వెల్లడించారు.

కాగా, మంగళగిరిలోని ఎయిమ్స్‌లో 183 బోధన సిబ్బంది పోస్టులకు 68 ఖాళీగా ఉన్నాయనీ, 1054 బోధనేతర సిబ్బందికి 425 పోస్టులు ఖాళీలు ఉన్నాయని చెప్పారు. రెండు తెలుగు రాష్ట్రాలలో ఖాళీగా ఉన్న పోస్టులను వెంటనే భర్తీ చేస్తామని చెప్పారు. కాగా, దేశంలో ఉన్న ఎయిమ్స్‌లలో మౌలిక సౌకర్యాలు కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని మంత్రి భారతి పవార్‌ వెల్లడించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement