Tuesday, May 7, 2024

నా బిడ్డ‌ని మా అమ్మ చూసుకుంటోంది.. టెన్ష‌న్ లేకుండా న‌టిస్తున్నా.. కాజ‌ల్

ఓ బిడ్డ‌కి త‌ల్ల‌య్యాక హీరోయిన్ కాజ‌ల్ సెకండ్ ఇన్నింగ్స్ ని ప్రారంభించింది. బిడ్డకు జన్మనిచ్చిన మూడు నెలలకే ఎందుకు నటిస్తున్నావు అంటూ అందరూ తనను అడుగుతున్నారని కాజల్ తెలిపారు. నటనపై ఉన్న ఇష్టంతోనే తొందరగా రీఎంట్రీ ఇచ్చానంది. తాను ప్రధాన పాత్రలో నటించిన ఘోస్టీ చిత్రం ఈనెల 17న విడుదల కానుంది. ఈ నేపథ్యంలో ఆమె మీడియాతో మాట్లాడుతూ..నా కుమారుడిని నా తల్లి చూసుకుంటారు. అందుకే నేను కెమెరా ముందు ఎలాంటి టెన్షన్ లేకుండా నటించగలుగుతున్నాన‌ని చెప్పింది. అందులో భాగంగానే ఇండియన్ 2 సినిమాలో అవకాశాన్ని దక్కించుకున్నఈమె.. నందమూరి బాలకృష్ణ సినిమాలో హీరోయిన్ గా అవకాశం దక్కించుకుంది. తాజాగా తన కెరీర్‌ పై ఆసక్తి కర వ్యాఖ్యలు చేసింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement