Sunday, April 28, 2024

తిరుమలలో తగ్గిన భక్తుల రద్దీ..!

తిరుమలలో నేటితో శ్రీవారి వార్షిక తెప్పోత్సవాలు ముగియనున్నాయి. నేడు శ్రీదేవి భూదేవి సమేతుడైన మలయప్పస్వామి తెప్పలపై విహరించనున్నారు. ఆర్జిత, సహస్ర దీపాలంకరణ సేవలను రద్దు చేయనున్నారు. తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు కొండపై మూడు కంపార్ట్‌మెంట్లలో వేచియున్నారు. టోకెన్ లేని భక్తుల శ్రీవారి సర్వదర్శనానికి 14 గంటల సమయం పడుతోంది. సోమవారం శ్రీవారిని 65,613 మంది భక్తులు దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. నిన్న శ్రీవారి హుండీ ఆదాయం రూ.4.14 కోట్లు వచ్చినట్టు తిరుమల తిరుపతి దేవస్థానం వెల్లడించింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement