Friday, April 26, 2024

ఓల్డ్ సిటీలో రౌడీ షీటర్ దారుణ హత్య

హైదరాబాద్‌లోని పాతబస్తీలో రౌడీషీటర్‌ దారుణ హత్యకు గురయ్యాడు. ఓల్డ్‌ మలక్‌పేటలో శుక్రవారం అర్ధరాత్రి దాటిన తర్వాత ముస్తాక్‌ అనే రౌడీ షీటర్‌ను దుండగులు కత్తులతో నరికి చంపేశారుఈ ఘటనపై సమాచారం తెలుసుకున్న చాదర్‎ఘాట్ పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. అనంతరం కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. నిందితుల కోసం గాలిస్తున్నారు. రెక్కీ నిర్వహించి హత్య చేసినట్లు భావిస్తున్నారు. ఈ హత్యకు గల కారణం పాతకక్షలేనని పోలీసులు అనుమానిస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement