Tuesday, April 30, 2024

ఒకే ఫోన్‌లో మ‌ల్టిపుల్ ఎకౌంట్స్.. వాట్సాప్‌లో మ‌రో కొత్త‌ ఫీచర్

మెటా మెసేజింగ్ అప్లికేషన్ వాట్సాప్ ప్రపంచంలో అత్యధికంగా ఉపయోగించే యాప్‌లలో ఒకటి. మెటా వినియోగదారుల అనుభవాన్ని మెరుగుపరచడానికి ఎప్ప‌టిక‌ప్ప‌డు కొత్త ఫీచర్లు, అప్‌డేట్‌లను అందిస్తూనే ఉంటుంది. ఇప్పుడు వినియోగదారుల కోసం కంపెనీ మరో కొత్త ఫీచర్‌ను అందుబాటులోకి తెచ్చింది. ఇన్స్టాగ్రామ్ యాప్‌లో మాదిరిగానే ఒకే ఫోన్‌లో ఒకటి కంటే ఎక్కువ ఎకౌంట్ల‌నే ఉపయోగించుకునే విధంగా వాట్సాప్ లో ఈ అప్డేట్ రానుంది.

ప్రస్తుతం ఉన్న వాట్సాప్ లో యూజ‌ర్స్ ఇక ఎకౌంట్ మాత్రమే ఉపయోగించగలరు. కాగా, వాట్సాప్ యాప్‌లో కొత్త అప్లికేషన్ అమలు చేస్తూ.. ఒకే ఫోన్‌లో ఒకటి కంటే ఎక్కువ వాట్సాప్ ఎకౌంట్ ల‌ను యాక్సెస్ చేసే విధంగా కొత్త ఫీచర్‌ను ప్రవేశపెట్టనున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement