Friday, May 17, 2024

సెట్‌లో ప్రమాదం.. ఆస్పత్రిలో చేరిన‌ టోవినో థామస్

కేరళ వరదల సమయంలో జరిగిన వాస్తవ సంఘటనల ఆధారంగా రూపొందించబడిన ‘‘2018’’ అనే సినిమాతో రీసెంట్ గా హిట్ అందుకున్నాడు మలయాళ హీరో టోవినో థామస్. కాగా, ప్ర‌స్తుతం ‘‘నడ్యార్ తిలకం’’ అనే మూవీలో నటిస్తున్నారు. సినిమా షూటింగ్ లో భాగంగా ఓ సన్నివేశంలో నటిస్తుండగా కాలికి గాయం కావడంతో చికిత్స నిమిత్తం ఆస్పత్రిలో చేరారు. చికిత్స అందించిన వైద్యులు రెండు వారాల పాటు విశ్రాంతి తీసుకోవాలని సూచించారు. ఈ కారణంగా, నటుడు తిలకం షూటింగ్ తాత్కాలికంగా నిలిపివేసారు మేకర్స్.

Advertisement

తాజా వార్తలు

Advertisement