Sunday, May 5, 2024

నేటి నుంచి మదర్ డెయిరీ పాల ధర పెంపు

కరోనా పరిస్థితుల తర్వాత పాలు, వాటి ఉత్పత్తులపై రేట్లను డెయిరీ సంస్థలు పెంచుతున్నాయి. గత నెలలోనే పాలపై అమూల్ రూ.2 పెంచగా.. తాజాగా ఇదే జాబితాలో మదర్ డెయిరీ చేరింది. దేశ రాజధాని ఢిల్లీతో పాటు పలు సిటీల్లో లీటరుపై రూ.2 ధర పెంచుతున్నట్లు తెలిపింది. 2019, డిసెంబర్‌లో ధరలు పెంచామని.. ప్రస్తుతం ఇన్‌పుట్ ట్యాక్స్ భారం వల్ల మళ్లీ నిర్ణయం అదే నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని మదర్ డెయిరీ స్పష్టం చేసింది.

ఏడాది కాలంగా రైతుల నుంచి పాల సేకరణ ధర పెరిగినా వినియోగదారులపై భారం మోపలేదని మదర్ డెయిరీ తెలిపింది. ప్రస్థుత మాగ్జిమమ్ రిటైల్ ప్ర్రైస్ కంటే లీటరుకు రెండు రూపాయలు పెంచారు. పెంచిన పాల ధరలు సెంట్రల్ ఉత్తరప్రదేశ్, ముంబై, నాగపూర్, కోల్ కతా తదితర నగరాల్లోనూ నేటి నుంచి అమలులోకి రానున్నాయి. దేశంలోని వంద నగరాల్లో మదర్ డెయిరీ పాలను విక్రయిస్తోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement