Tuesday, May 7, 2024

తెలంగాణలో నేడు,రేపు భారీ వర్షాలు..

తెలంగాణలో రుతుపవనాలు చురుగ్గా కదులుతున్నాయి. వీటి ప్రభావంతో గత కొన్ని రోజులుగా తెలంగాణ వ్యాప్తంగా చెదురుమదురు వర్షాలు పడుతున్నాయి. తెలంగాణలో నేడు, రేపు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణశాఖ పేర్కొంది. తెలంగాణలోని పలు జిల్లాలో ఇప్పటికే భారీ వర్షం పడుతోంది. రాజధాని హైదరాబాద్ సహా నిజామాబాద్ , కామారెడ్డి కరీంనగర్ , సూర్యాపేట తదితర జిల్లాలో మోస్తారు వర్షం పడుతోంది.

మరోవైపు బంగాళాఖాతంలో ఉత్తరాంధ్ర, ఒడిశా తీరాల వద్ద నేడు అల్పపీడనం ఏర్పడే అవకాశాలున్నాయి. గాలులతో ఆ ప్రాంతంలో ఇప్పటికే ఉపరితల ఆవర్తనం ఏర్పడినట్టు అధికారులు తెలిపారు. తూర్పు, పశ్చిమ ప్రాంతాల మధ్య గాలులతో ద్రోణి ఏర్పడినట్టు వాతావరణ శాఖ పేర్కొంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement