Sunday, December 8, 2024

అగ్నిప‌థ్ లో వెసులుబాటు – ముందు సిఈఈ, ఆ త‌ర్వాతే ఫిజిక‌ల్ టెస్ట్ లు

అమరావతి, ఆంధ్రప్రభ : దేశ వ్యాప్తంగా కొనసాగుతు న్న అగ్నిపధ్‌ పధకానికి రాష్ట్రంలో నిరుద్యోగ యువత నుంచి మంచి స్పందన లభిస్తోంది. ఇప్పటికే తొలి దశలో రెండు విడతలుగా రాష్ట్రంలో నిర్వహించిన అగ్నివీరుల ఎంపికకు వేల సంఖ్యలో అభ్యర్ధులు హాజరయ్యారు. మరోవైపు మహిళా అభ్యర్ధుల నుంచి కూడా అగ్నివీరుల ఎంపికకు దరఖాస్తులు రావడం విశేషం. ఈ నేపధ్యంలో అగ్ని వీరుల ఎంపిక ప్రక్రియలో ఇండియన్‌ ఆర్మీ కీలక మార్పులు తీసుకువచ్చింది. ఈ ఏడాది ఎంపిక విధానం అభ్యర్ధులకు అనుకూలంగా మరింత సులభతరం చేసిన ట్లు ప్రకటించింది. ఆర్మీలో ఉద్యోగాల ఎంపికకు సంబంధించి అగి ్నపధ్‌ పధకాన్ని కేంద్ర ప్రభుత్వం గత ఏడాది ప్రవేశపెట్టిన సందర్భంగా తొలుత దేశ వ్యాప్తంగా తీవ్ర వ్యతిరేకత వచ్చింది. తీవ్ర ఆందోళనల నడుమ హింసాత్మక ఘటనలు చోటు చేసుకున్నాయి. ఇక తెలుగు రాష్ట్రాల్లో సైతం నిరసన వ్యక్తమైంది. తెలంగాణాలో సికింద్రాబాద్‌ రైలు దగ్ధం ఘటన మరువలేనిది. అయినప్పటికీ కేంద్రం ఏమాత్రం వెనక్కు తగ్గకుండా అగ్నిపధ్‌ అమలుకు పటిష్ట చర్యలు చేపట్టింది. దీంతో రాను రాను నిరుద్యోగ యువతీ యువకుల్లో సానుకూల త ఏర్పడటంతో పాటు రాష్ట్రంలో స్పందన లభిస్తోంది. ఈ సంవత్సరానికిగాను ఎంపిక విధానంలో నూతన ప్రక్రియ చేస్తూ కీలక మార్పులు తీసుకురావడం జరిగింది. ఆర్మీలో చేరాలనుకునే వారికి తొలుత ఆన్‌లైన్‌ కామన్‌ ఎంట్రన్స్‌ ఎగ్జామ్‌ (సీఈఈ) నిర్వహించనుంది. ఆ తర్వాతే ఫిట్‌నెస్‌, మెడికల్‌ -టె-స్ట్‌లు నిర్వహించనున్నారు. ఇంతకుముందు అగ్నివీరుల ఎంపికలో తొలుత ఫిజికల్‌ -టె-స్ట్‌, మెడికల్‌ -టె-స్టు నిర్వహించారు. వీటిలో అర్హత సాధించిన వారికి సీఈఈ నిర్వహించారు. అయితే ప్రస్తుతం తీసుకువచ్చిన మార్పు కారణంగా ముందే సీఈఈ నిర్వహించడం వల్ల రిక్రూట్‌మెంట్‌లో భారీగా వడపోత జరుగుతుంది. దీని వల్ల మొత్తం ఎంపికలో అభ్యర్ధుల రద్దీ తగ్గేందుకు వీలుంటుంది. పైగా ఆన్‌లైన్‌ టెస్ట్‌ కావడంతో అభ్యర్ధులకు ప్రయాణ ఇబ్బందులు కూడా ఉండవు. దేశవ్యాప్తంగా 200 కేంద్రాల్లో భాగంగా మన రాష్ట్రంలో కొత్త విధానంతో తొలి విడత సీఈఈ ఏప్రిల్‌లో జరుగునుంది. ఈ ప్రక్రియ ద్వారా 2023-24 రిక్రూట్‌మెంట్‌లో సుమారు 40వేల మంది సైన్యం లో చేరేందుకు దోహదపడనుంది. పాత విధానంలో ఇప్పటి వరకు 19వేల మంది అగ్నివీరులు సైన్యంలో చేరారు.

ఈనెల 15వరకు అవకాశం
అగ్నిపధ్‌ నూతన ప్రక్రియకు ఈనెల 15వ తేదీ వరకు దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం ఉంది. నగరాల్లో సుమారు లక్షన్నర వరకు, పట్టణాల్లో దాదాపు ఐదు వేల మంది వరకు అభ్యర్ధులు రిక్రూట్‌మెంట్‌ ర్యాలీలో పాల్గొనేందుకు ఆసక్తి చూపుతున్నారు. ఈ అంచనాతోనే ఎంపికలో మార్పు చేసినట్లు తెలుస్తోంది. పూర్తి పారదర్శకతతోపాటు అభ్యర్థుల మెంటల్‌ ఎబిలిటీ-, ఫిజికల్‌ ఫి-ట్‌నెస్‌ అంశాలకు అనుగుణంగా ఈ మార్పులు చేసినట్లు- అధికారులు చెబుతున్నారు. ఆర్మీలో జూనియర్‌ కమిషన్డ్‌ ఆఫీసర్స్‌(జేసీవో), ఇతర ర్యాంకులతో(ఓఆర్‌)పాటు- అగ్నివీరుల భర్తీ ప్రక్రియ ఈ విధానంలోనే ఉంటుంది. మొదటి దశలో ప్రాథమిక అర్హత పరీక్ష, రెండో దశలో శారీరక, వైద్య పరీక్షల ద్వారా భర్తీ కానున్న అగ్నివీరులకు ఆసక్తి చూపే అభ్యర్ధులు జాయిన్‌ ఇండియన్‌ ఆరీ ్మ అనే వెబ్‌సైట్‌ ద్వారా మార్చి 15లోగా దరఖాస్తు చేసుకోవాలని అధికారులు కోరుతున్నారు. దీంతో మార్చి మొదటి వారం నాటికి సుమారు 21వేల మంది అగ్నివీరులు సైన్యంలో చేరనున్నట్లు అంచనా. అవివాహితులైన పురుష అభ్యర్థుల నుంచి ద్వారా మాత్రమే దరఖాస్తులు స్వీకరించడం జరుగుతుంది. అగ్నివీర్‌ జనరల్‌ డ్యూటీ-, అగ్నివీర్‌ -టె-క్నికల్‌, అగ్నివీర్‌ క్లర్క్‌, స్టోర్‌ కీపర్‌ పోస్టులకు పదోతరగతి ఉత్తీర్ణత, అగ్నివీర్‌ ట్రేడ్స్‌మెన్‌ పోస్టుకు ఎనిమిదో తరగతి ఉత్తీర్ణత అర్హతగా నిర్ణయించారు. తొలి విడతగా ఏప్రిల్‌ 17 నుంచి మే 4 వరకు ఆన్‌లైన్‌ ద్వారా కంప్యూటర్‌ రాతపరీక్ష ఉంటుంది. దీనిలో అర్హత సాధించిన వారికి రెండో విడతగా ప్రకటించిన సమయం, తేదీల్లో రిక్రూ-ట్‌మెంట్‌ ర్యాలీ నిర్వహిస్తారు. కాగా సైన్యంలో సాంకేతిక విభాగాల్లో సిబ్బంది సంఖ్యను పెంచేందుకు అనువుగా ఇకపై ఐటీ-ఐ, పాలి-టె-క్నిక్‌ పూర్తిచేసిన అభ్యర్థులకు నియామకంలో 20 నుంచి 50 వరకు అదనపు మార్కులు ఇవ్వనున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement