Thursday, April 25, 2024

ఆరోపణల కారణంగా కానిస్టేబుల్ లను అటాచ్ చేయలేదు : వరంగల్ సీపీ రంగనాథ్

వరంగల్ పోలీస్ కమిషనర్ పరిధిలో ఎనిమిది మంది పోలీస్ కానిస్టేబుల్ ల‌పై ఆరోపణలు రావడంతో వారిని మహబూబాబాద్ జిల్లా పోలీస్ కు అటాచ్ చేసినట్లుగా వివిధ వాట్సాప్ గ్రూపులో ప్రచారం జరుగుతోంది. ఈ ప్రచారంలో ఎలాంటి వాస్తవం లేదు. గతంలో కొద్ది మంది మహిళా కానిస్టేబుళ్లు వరంగల్ కమిషనరేట్ కు బదిలీ కావడంతో వారి స్థానంలో ప్రస్తుతం వెలుబడిన ఉత్తర్వుల మేరకు ఎనిమిది మంది కానిస్టేబుల్ లను మహబూబాబాద్ జిల్లా ఎస్పీకి అటాచ్ చేస్తున్నట్లుగా ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది. అంతేకానీ అటాచ్ కాబడిన సదరు కానిస్టేబుళ్లను ఆరోపణలపై అటాచ్ చేసినట్లుగా వస్తున్న వార్తల్లో ఎలాంటి నిజం లేదనద‌న్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement