Sunday, April 28, 2024

తెలంగాణలో మోడల్ స్కూల్స్ ప్రవేశ పరీక్షలు వాయిదా

కరోనా ఎఫెక్ట్ కారణంగా పలు పరీక్షలు వాయిదా పడుతున్నాయి. ఈ నేపథ్యంలో తెలంగాణలోని మోడ‌ల్ స్కూల్స్‌కు సంబంధించి 7 నుంచి 10వ త‌ర‌గతి ప్ర‌వేశాల కోసం జూన్ 5న జ‌ర‌గాల్సిన ప‌రీక్ష వాయిదా ప‌డింది. 6వ త‌ర‌గ‌తి ప్ర‌వేశాల కోసం జూన్ 6న జ‌రగాల్సిన ప‌రీక్ష కూడా వాయిదా ప‌డింది. ఆద‌ర్శ పాఠ‌శాల‌ల ప్ర‌వేశ ప‌రీక్ష‌ల ద‌ర‌ఖాస్తు గ‌డువును జూన్ 20వ తేదీ వ‌ర‌కు పొడిగించారు. ప్రవేశ ప‌రీక్ష‌ల తేదీల‌ను తర్వాత ప్ర‌క‌టిస్తామ‌ని ఆద‌ర్శ పాఠ‌శాల‌ల ప్రాజెక్టు డైరెక్ట‌ర్ తెలిపారు. పూర్తి వివరాల కోసం http://telanganams.cgg.gov.in వెబ్‌సైట్‌ను పరిశీలించాలని డైరెక్టర్ తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement