Sunday, May 5, 2024

సింగపూర్-భారత్ మధ్య నగదు బదిలీ ఇకనుంచి మరింత సులభం.. రియల్‌టైమ్ పేమెంట్ సిస్టం నేడు ప్రారంభం

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ: భారతదేశం, సింగపూర్ నగదు బదిలీ మరింత సులభతరం కానుంది. ఈ మేరు రియల్ టైమ్ పేమెంట్ సిస్టమ్‌ను నేటి నుంచి ప్రారంభం కానుంది. భారతదేశం విస్తృతంగా వినియోగిస్తున్న ‘యూపీఐ’ విధానానికి సింగపూర్ ‘పేనౌ’తో అనుసంధానం చేసేందుకు రెండు దేశాలు సిద్ధమయ్యాయి. తద్వారా తక్కువ ఖర్చుతో రెండు దేశాల మధ్య వేగవంతంగా నగదు బదిలీ సాధ్యమవుతుందని భారత ప్రభుత్వం విడుదల చేసిన ఒక ప్రకటనలో పేర్కొంది.

- Advertisement -

ఈ విధానం సింగపూర్‌లో నివసించే భారతీయులు స్వదేశానికి డబ్బు పంపడాన్ని మరింత సులభతరం చేస్తుందని, అదేమాదిరిగా భారత్ నుంచి సింగపూర్‌కు జరిపే నగదు లావాదేవీలకు సైతం ఉపయోగకరంగా ఉంటుందని వెల్లడించింది. రెండు దేశాల పేమెంట్ విధానాలను అనుసంధానించే ప్రక్రియను మంగళవారం ఉదయం గం. 11.00కు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నర్ శక్తికాంత దాస్, సింగపూర్ మోనటరీ అథారిటీ ఎండీ రవి మీనన్ సంయుక్తంగా ప్రారంభించనున్నారు. వీడియో కాన్ఫరెన్సు ద్వారా జరగనున్న కార్యక్రమంలో భారత ప్రధాని నరేంద్ర మోదీతో పాటు సింగపూర్ ప్రధాని లీసీన్ లూంగ్ పాల్గొననున్నారు. 

Advertisement

తాజా వార్తలు

Advertisement