Sunday, May 19, 2024

మానవాళికి మొక్కలతోనే రక్షణ…

మేడికొండూరు ఫిబ్రవరి 20(ప్రభా న్యూస్) మండల పరిధిలోని విశదల సమీపంలో ఉన్న ఎన్ఆర్ఐ ఇంజనీరింగ్ కళాశాలలో మొక్కలు మానవాళికి చేసే మేలు పై సదస్సు నిర్వహించారు ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ కోటా శ్రీనివాసరావు అధ్యక్షత వహించి భూమి మరియు మానవాళి మనగూడ మొక్కలు తానే ఆధారపడి ఉన్నదని ప్రతి విద్యార్థి భూమాతను రక్షించుకోవాలని మంచి వాతావరణం ముందున్న మానవాళికి అందించాలని అది అందరి బాధ్యత వహించాలని ప్రతి విద్యార్థి తమ నివాస స్థలాలు పరిసర ప్రాంతాల్లో పండ్ల పూల మొక్కలు నీడనిచ్చే మొక్కలు నాటి భూతలాన్ని రక్షించుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎన్నారై కళాశాల మరియు పరిసర ప్రాంతాలలో 200 పైగా కొబ్బరి చెట్లను నాటారు ఈ మొక్కలు నాటే కార్యక్రమం పట్ల కళాశాల సెక్రటరీ శ్రీ ఆలపాటి రాజేంద్రప్రసాద్ హర్షం వ్యక్తం చేశారు.ఈ కార్యక్రమంలో ఎన్.ఎస్.ఎస్ వాలంటీర్ మరియు విద్యార్థిని విద్యార్థులు వివిధ విభాగాధిపతులు వైస్ ప్రిన్సిపాల్ శ్రీహరి, ఏ.వో సీతారామయ్య,డాక్టర్ చంద్రమౌళి, డాక్టర్ రెహమాన్, ఎన్ ఎస్ ఎస్ పి రవికుమార్ మరియు బోధన బోధనేతర సిబ్బంది పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement