Sunday, April 28, 2024

Wishes – ప్ర‌ధాని మోదీ దేశ ప్ర‌జ‌ల‌కు గ‌ణ‌తంత్ర శుభాకాంక్ష‌లు ..

దేశవ్యాప్తంగా 75వ గణతంత్ర వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ఈ ఏడాది వేడుకలకు ముఖ్య అతిథిగా వచ్చిన ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమాన్యుయేల్ మాక్రాన్ దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. ‘‘75వ గణతంత్ర దినోత్సవ ప్రత్యేక సందర్భంలో శుభాకాంక్షలు. జై హింద్!’’ అంటూ ‘ఎక్స్’ వేదికగా ప్రధాని మోదీ ట్విట్ చేశారు. ఇక ఇమాన్యుయేల్ మాక్రాన్ కూడా భారత పౌరులకు శుభాకాంక్షలు తెలిపారు.

‘‘నా ప్రియ నేస్తం నరేంద్ర మోదీ, భారతీయ ప్రజలకు మీ గణతంత్ర దినోత్సవం సందర్భంగా నా హృదయపూర్వక శుభాకాంక్షలు. మీ వద్దే ఉన్నందుకు చాలా సంతోషంగా, గర్వంగా ఉంది. వేడుకలు జరుపుకుందాం!’’ అంటూ ఎక్స్ వేదికగా ఆయన స్పందించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement