Tuesday, April 30, 2024

బందీపూర్ టైగ‌ర్ రిజ‌ర్వ్ లో ప్ర‌ధాని ప‌ర్య‌ట‌న‌..కొత్త లుక్ లో మోడీ

మైసూరు – ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ కర్ణాటకలోని బందీపూర్ టైగర్ రిజర్వ్‌‌లో సఫారీ ట్రిప్ వేశారు. ఆదివారం బందీపూర్ టైగర్ రిజర్వ్‌లో సఫారీని ప్రధాని సందర్శించారు. దాదాపు 20 కిలోమీటర్లు ప్రయాణించి అటవీ అందాలను ఆస్వాదించారు. ఈ సందర్భంగా మోడీ నయా లుక్‌లో కనిపించి అందరినీ ఆశ్చర్యపరిచారు. ఖాకీ ప్యాంట్‌, కామోఫ్లాజ్‌ టి-షర్ట్‌, స్లీవ్‌లెస్‌ జాకెట్‌ ధరించి ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ టైగర్‌ రిజర్వ్‌ను సందర్శించిన తొలి ప్రధానిగా మోడీనిలిచారు.
దీంతో పాటు ప్రధాని తమిళనాడు ప్రాంతంలోని మదులై ఫారెస్ట్‌ వెళ్లారు. ఇక్కడ తెపకాడు ఎలిఫాంట్ క్యాంపును సందర్శించారు. ఈ సందర్భంగా ఆస్కార్‌ అవార్డును గెలుచుకున్న ఎలిఫెంట్‌ విస్పరర్స్‌ డాక్యుమెంటరీలో కనిపించిన ఏనుగులను ప్రధాని చూశారు. ఈ డాక్యుమెంటరీలో కనిపించిన బొమ్మన్, వల్లిలను కలిసిన ప్రధాని.. డాక్యుమెంటరీలోని ఏనుగు రఘు దగ్గరికి వెళ్లి దానిని ముద్దు చేశారు.. అనంతరం రఘుకు చెరుకుగడలు తినిపించారు.

ఆ త‌ర్వాత ప్రాజెక్ట్ టైగర్ 50వ వార్షికోత్సవాల సందర్భంగా మైసూరులో ఈ గణాంకాలను ఆయన విడుదల చేశారు. 2006లో 1,411 పులులు, 2010లో 1,706 పులులు, 2014లో 2,226 పులులు, 2018లో 2,967 పులులు ఉండేవని తెలిపారు. 2006తో పోల్చినపుడు ప్రస్తుతం పులుల సంఖ్య 124.45 శాతం పెరిగిందని తెలిపారు. స్వాతంత్ర్యం వచ్చిన అమృత కాలంలో పులుల సంఖ్య పెరుగుదలపై విజన్ డాక్యుమెంట్‌ను మోడీ విడుదల చేశారు. రూ.50 స్మారక నాణేన్ని, భారత దేశంలో పులుల అభయారణ్యాల మదింపు నివేదికను కూడా విడుదల చేశారు. పులులు, చిరుతలు, సింహాలు, మంచు చిరుతలు, పూమాలు, జాగ్వార్‌లు వంటి ఏడు రకాల బిగ్ కేట్స్ సంరక్షణ కోసం అంతర్జాతీయ బిగ్ కేట్ అలయెన్స్‌ను మోడీ ప్రారంభించారు

Advertisement

తాజా వార్తలు

Advertisement